పళనిసామికి పన్నీర్ సెల్వం ఝలక్: ఎదురు చెప్పిన గంటకే, ఈసీకి 6,500 పేజీలు!
అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాల్లో శశికళ ఫోటోలు తొలగించమని మంత్రి శ్రీనివాసన్ తేల్చి చెప్పిన ఒక గంట వ్యవదిలోనే పన్నీర్ సెల్వం వర్గం ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించి మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని
న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు మంగళవారం ఎన్నికల కమిషన్ 6,500 పేజీల అఫిడవిట్లు సమర్పించారు.
రెండాకుల చిహ్నం కోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గం, పన్నీర్ సెల్వం వర్గం నాయకులు ఎన్నికల సంఘం ముందు పోటీ పడుతున్నారు. జూన్ 16వ తేదీలోపు రెండు వర్గాల నాయకులు అఫిడవిట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ సూచించింది.

50 రోజుల ముందే రంగంలోకి
ఇంకా దాదాపు 50 రోజులు సమయం ఉన్నా పన్నీర్ సెల్వం వర్గం మాత్రం ఒక్క అడుగు ముందుకు వేసింది. మంగళవారం పన్నీర్ సెల్వం వర్గం 6,500 పేజీల అఫిడవిట్లు న్యూఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కు సమర్పించింది.

ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు
ఓ పక్క విలీనం అంటూ చర్చలు జరపడానికి సిద్దం అవుతున్న సమయంలో పన్నీర్ సెల్వం వర్గం భారత ఎన్నికల కమిషన్ కు రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని అఫిడవిట్లు సమర్పించడంతో ఎడప్పాడి పళనిసామి వర్గం షాక్ కు గురైయ్యింది.

మేమే ముందున్నాం అంటున్నారు
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు రాజీ అయ్యి రెండాకుల చిహ్నం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పన్నీర్ సెల్వం వర్గం దూకుడు ప్రదర్శించింది. ముందుగా పక్కా ప్లాన్ తో ఎన్నికల కమిషన్ ను సంప్రదించి ఎడప్పాడి పళనిసామి వర్గానికి ఝలక్ ఇచ్చింది.

రాజీనా తొక్క, మా ప్రయత్నం మాదే
రెండు వర్గాలు రాజీకావాలని ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. మంగళవారం శశికళ ఫోటోలు మొత్తం తొలగిస్తేనే మేము రాజీకి వస్తామని పన్నీర్ సెల్వం వర్గం కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకు వచ్చింది.

శశికళ ఫోటో తొలగించం
అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాల్లో శశికళ ఫోటోలు తొలగించమని మంత్రి శ్రీనివాసన్ తేల్చి చెప్పిన ఒక గంట వ్యవదిలోనే పన్నీర్ సెల్వం వర్గం ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించారు. మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని పన్నీర్ సెల్వం వర్గం ఎడప్పాడి పళనిసామి వర్గానికి గట్టిగానే హెచ్చరించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications