ఆ కుప్పకూలిన భవనం అమాత్యుడిదేనా? కొనసాగుతున్న సహాయక చర్యలు
బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడలో నిర్మాణంలో ఉన్న అయిదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న భవన నిర్మాణ కార్మికులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు.
ఇంతకీ- ఈ భవనం ఎవరిదనే విషయం చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మంత్రి వినయ్ కులకర్ణిదేనని తెలుస్తోంది. వినయ్ కులకర్ణి కర్ణాటక ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం ధార్వాడ. సుమారు 3000 చదరపు అడుగుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు.

ధార్వాడలోని కుమరేశ్వర నగరలో షాపింగ్ కాంప్లెక్స్ గా దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం నలుగురు యజమానుల్లో మంత్రి వినయ్ కులకర్ణి ఒకరని సమాచారం. అయిదంతస్తుల ఈ భవనం నిర్మాణ పనులు ఏడాదిగా కొనసాగుతున్నాయి. తొలి రెండు అంతస్తుల్లో నిర్మాణాలు పూర్తి కావడంతో.. వాటిని వివిధ వ్యాపార కార్యకలాపాల కోసం అద్దెకు ఇచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన మూడంతస్తుల్లో నిర్మాణ పనులు నడుస్తున్నాయని అంటున్నారు.

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..
నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనపై ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు. అవసరమైతే సహాయక సిబ్బందిని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ధార్వాడకు పంపించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications