కేంద్ర ప్రభుత్వ బిగ్గెస్ట్ యాక్షన్ ప్లాన్

Civil Defence 2025: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.

ఫలితంగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. త్రివిధ దళాలు పూర్తిగా యాక్టివేట్ అయ్యాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నాయి.

Ministry of Home Secretary to hold a meeting over Civil Defence today

యుద్ధ మేఘాలు కమ్ముకుంటోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ వస్తోన్నారు. త్రివిధ దళాధిపతులతోనూ సమావేశం అయ్యారాయన. రక్షణ మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి అధికారులతో వరుస భేటీలను జరిపారు.

త్రివిధ దళాధిపతులు ఉపేంద్ర ద్వివేది (ఆర్మీ), అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి (నేవీ), అమర్ ప్రీత్ సింగ్ (వైమానిక దళం)తో ప్రధాని మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు. యుద్ధానికి దిగాల్సి వస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంశం ఆరా తీశారు. జమ్మూ కాశ్మీర్ వద్ద సరిహద్దు చొరబాట్లను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు సాగించారు.

అదే సమయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చింది. బుధవారం తొలి విడత సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఏర్పాటయింది. యుద్ధం వస్తే దీన్ని ఎలా ఎదుర్కొవాల్సి ఉంటుందనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించాల్సి ఉంటుంది ఆయా రాష్ట్రాలకు.

శతృవులు ఎదురుగా నిల్చున్నప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలి?, అత్యవసర పరిస్థితులను ఎలా అధిగమించాలి?, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి?, గాయపడ్డ వారిని ఆసుపత్రులకు ఎలా తరలించాలి?, వారికి అవసరమైన రవాణా ఎలా అందుబాటులో ఉంచాలి?.. అనే అంశాలపై ఆ మాక్ డ్రిల్ కొనసాగుతుంది.

వైమానిక దాడి హెచ్చరిక వ్యవస్థల ప్రభావాన్ని అంచనా వేయడం, వైమానిక దళంతో హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్ లింక్‌ల నిర్వహణ, కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానం కావడం, దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడం, క్రాష్ బ్లాక్ అవుట్‌లో ఎలా వ్యవహరించాలి, అగ్నిమాపక- రెస్క్యూ ఆపరేషన్లల్లో ఎలా పాల్గొనాలి వంటివి ఇందులో నేర్పిస్తారు.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 244 జిల్లాల్లో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఉంటుంది. సిివిల్ డిఫెన్స్ వార్డెన్లు, హోమ్ గార్డులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్లు, వలంటీర్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సభ్యులు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తారు.

మాక్ డ్రిల్‌పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేడు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ ఉదయం 10:45 నిమిషాలకు ఈ భేటీ ఏర్పాటైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కొనసాగుతుంది. మాక్ డ్రిల్‌ నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు, నియమ నింబధనలపై చర్చిస్తారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+