పెళ్ళికి ఒప్పుకోలేదని మైనర్ బాలికను కిడ్నాప్ చేసి మూడువారాల పాటు అత్యాచారం చేశాడు
మైనర్ బాలికపై మూడు వారాల పాటు అత్యాచారం చేశాడు ఓ యువకుడు. బాలికను కిడ్నాప్ చేసి తన పొలంలో ఓ గుంతలో బందించి మూడువారాలపాటు అత్యాచారం చేశాడు. మూడు వారాల తర్వాత నిందితుడిని , అతనికి సహకరించిన ఏడుగురు ని
అహ్మదాబాద్ :గుజరాత్ లోని మోర్బి జిల్లాలోని కొట్టా నయని గ్రామంలో మైనర్ బాలికపై ఓ యువకుడు మూడువారాలుగా అత్యాచారం చేశాడు. ఆమెను కిడ్నాప్ చేసి బంధించి మరీ అత్యాచారం చేశారు. మైనర్ బాలికను ఆ యువకుడికి ఇచ్చేందుకు ఆ బాలిక కుటుంబసభ్యుులు అంగీకరించలేదు.దీంతో ఆయన ఆ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు.
గుజరాత్ రాష్ట్రంలోని కొట్ట నయని గ్రామానికి చెందిన నరేష్ సోలంకి అనే 19 ఏళ్ళ యువకుడు తన సామాజికవర్గానికి చెందిన అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ళ బాలికను వివాహం చేసుకోవాలని భావించాడు.

ఈ విషయమై భాదిత కుటుంబసభ్యులతో ఆయన చర్చించాడు. అయితే ఆయనకు బాలికను ఇచ్చి వివాహం చేసేందుకు మాత్రం వారు అంగీకరించలేదు. దీంతో నవంబర్ 11వ, తేదిన ఆ బాలికను కిడ్నాప్ చేసి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పొలానికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత పొలంలో ఆమెను ఓ గుంత తవ్వి అక్కడ ఆమెను బంధించాడు.మూడువారాలపాటు ఆ గుంతలోనే ఆమెను పెట్టి అత్యాచారం చేశాడు.
అయితే ఎట్టకేలకు ఆ బాలిక ఆచూకీని కనుగొన్నారు. బాలిక కుటుంబసభ్యలు, గ్రామస్థులు ఆ బాలికను విడిపించారు. నిందితుడితో పాటు మరో ఏడుగురు కలిసి తనను బంధించారని బాలిక వివరించింది.అయితే తనపై అత్యాచారం చేసేందుకే కిడ్నాప్ చేశాడని బాదితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.బాలికను కిడ్నాప్ చేసిన
ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టుచేశారు.












Click it and Unblock the Notifications