యువతిని కిడ్నాప్ చేసి రేప్: యాసిడ్ దాడితో హత్య
భువనేశ్వర్: ఒరిస్సా రాష్ట్రంలోని బాలంగిర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు ఆమెపై యాసిడ్ దాడి చేసి హత్య చేశారు.
కాగా, మృతురాలు ఇటీవలే పదో తరగతి పాసయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలికను శుక్రవారం ఉదయం దుండగులు కిడ్నాప్ చేశాడు. కాగా, శనివారం రాత్రి ఆమె ఓ కాలువ సమీపంలో శవమై కనిపించింది.

ఆమె మొహం, మెడపై యాసిడ్ గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల జిల్లాలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications