కూతురిపై మూడేళ్లుగా తండ్రి రేప్, తన ఫ్రెండ్స్‌తో సెక్స్‌లో పాల్గొనాలని బలవంతం
కోయంబత్తూరు: 14 ఏళ్ల బాలిక పైన ఓ తండ్రి మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కోయంబత్తూరులోని ఇరుగూరు ప్రాంతంలో ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది. బాలిక పైన తాను అత్యాచారం చేయడమే కాకుండా తన ముగ్గురు సహచరులతో సెక్స్‌లో పాల్గొనాలని కూతురును బలవంతం చేస్తున్నాడు.
తండ్రి వేధింపులు తడ్డుకోలేక ఆ మైనర్ బాలిక అతని నుండి శనివారం నాడు తప్పించుకొని వచ్చింది. అనంతరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 57 ఏళ్ల తండ్రిని, అతని ముగ్గురు సహచరులను ఆదివారం అరెస్టు చేశారు. వారిని కోర్డులో ప్రవేశ పెట్టారు. అనంతరం కేంద్ర కారాగారానికి తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలు ఆరో తరగతి డ్రాపౌట్ విద్యార్థిని. వారం రోజుల క్రితం చైల్డ్ లైన్ అధికారులు బాలిక తన తల్లిదండ్రులతో ఉంటున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సమయంలో వారికి ఈ విషయం తెలిసింది. స్థానికంగా ఉంటున్న వారిని అడిగి విషయం తెలుసుకున్నారు.
మహిళా ఇంజనీర్ మృతి
22 ఏళ్ల మహిళా జూనియర్ ఇంజనీర్ గోపేశ్వర్‌లో మృతి చెందింది. ఆమె తన తల్లి వద్ద నివసిస్తోంది. ఇంటికి సమీపంలో ఆమె విగతజీవిగా కనిపించింది. శుక్రవారం నాడు సాయంత్రం ఓ పని నిమిత్తం బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు.












Click it and Unblock the Notifications