మణిపూర్ గర్ల్‌పై ఓనర్ కొడుకు రేప్, కేజ్రీవాల్‌పార్టీ అటాక్

అతడిని అరెస్టు చేసి పిఓసిఎస్‌ఓ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెనె్సస్) చట్టం కింద వసంత్ విహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ యువకుడు నిడో టానియా న్యూఢిల్లీలో హత్యకు గురైన కొద్ది రోజులకే ఈ సంఘటన చోటు చేసుకోవడం సంచలనం సృష్టించింది.
దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో ఉంటున్న బాలికపై ఆ ఇంటి యజమాని కుమారుడు విక్కీ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో అత్యాచారం చేశాడు. ఆమెకు ముఖంపై, శరీరంలోని ఇతర ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి.
బాలిక కొన్ని సరకులు కొనేందుకు ఇంటి నుండి బయటకు వచ్చింది. విక్కీ ఆమెను అనుసరించి, అపహరించి సమీపంలోని గదిలో అత్యాచారం చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
బాలికపై అతడు పలుమార్లు ఘోరంగా అత్యాచారం చేశాడని, ప్రస్తుతం ఆమె పరిస్థితి దారుణంగా ఉందని, జంతువు కూడా అలా చేయదని ఓ విద్యార్థిని ఆవేదనగా చెప్పింది. విక్కీ ఒక్కరే అత్యాచారం చేయలేదని, అతనికి ఎవరో సాయం చేశారని వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అత్యాచారాన్ని నిరసిస్తూ ఈశాన్య రాష్ట్ర విద్యార్థులకు చెందిన వివిధ సంఘాలు వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది.
మరోవైపు ఈ పరిస్థితికి పోలీసులే కారణమంటూ స్థానిక పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్ఓను సస్పెండ్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఢిల్లీ పోలీసులపై కేంద్రం పెత్తనం చలాయిస్తుండటంతో నగరంలో మహిళల భద్రతపై ఇక్కడి వారు నిస్సహాయులుగా మిగిలి పోవాల్సి వస్తుందని ఆరోపించింది.












Click it and Unblock the Notifications