జైట్లీ రోడ్ షోలో పేలిన గాలి బుడగ, మోడీకి కేజ్రీ సవాల్

Arun Jaitley
ఢిల్లీ/అమృత్‌సర్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ రోడ్డు షోలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. శిరోమణి అకాలీదళ్, బిజెపి కూటమి నేతలతో కలిసి జైట్లీ ఓపెన్ ట్రక్కులో ప్రయాణిస్తుండగా గ్యాస్‌తో నింపిన బుడగలు పేలిపోయాయి. మంగళవారం అమృత్ సర్ విమానాశ్రయానికి చేరుకున్న జైట్లీ నేతలతో కలిసి ట్రక్కులో బయలుదేరారు.

కొద్ది దూరం వచ్చాక ఓ నేత చేతిలో ఉన్న గాలి బుడగలు ఒక్కసారిగా పేలి గాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో జోషీ ముఖంపై స్వల్ప గాయాలయ్యాయి. అందరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ కార్యక్రమంలో సిట్టింగ్ ఎంపి నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గొనలేదు. ఆయన భార్య, ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ హాజరయ్యారు.

మోడీకి కేజ్రీవాల్ సవాల్

భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వారణాసిలో ఓడించి తీరుతానని, అదే తన లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వారణాసిలో తమ అభ్యర్థిని ప్రకటించగానే మోడీ అక్కడి నుంచి పారిపోతారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్‌బబ్బర్ పేరు ప్రకటించగానే ఆయన తన సిట్టింగ్ స్థానాన్ని వదిలి పారిపోయారని, రేపు వారణాసిలో కూడా అదే పునరావృతం కాబోతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా ఎద్దేవా చేశారు.

వారణాసిలో ఓటమి భయంతోనే మోడీ గుజరాత్ నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. మోడీకి పోటీగా బలమైన అభ్యర్థిని నిలబెడతామని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. వారణాసిలో కేజ్రీవాల్‌ను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దింపే ఆలోచనేదీ కాంగ్రెస్‌కు లేదని ఆ పార్టీ మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి స్పష్టం చేశారు.

రానున్న ఎన్నికల్లో వారణాసిలో మోడీని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 23న వారణాసిలో సభ నిర్వహించి తన పోటీపై ప్రజాభిప్రాయాన్ని కోరాలన్న కేజ్రీవాల్ నిర్ణయానికి స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన సభను 25కు వాయిదా వేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+