వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 ఏళ్ల మైనర్ పై గ్యాంగ్ రేప్-కేసు పెడదామని స్టేషన్ కొస్తే మరోసారి-పోలీసుల దుర్మార్గం

|
Google Oneindia TeluguNews

మహిళలకే కాదు మైనర్లకు రక్షణ కరవవుతోంది. రోడ్లపై, ఇళ్లలో ఎక్కడ కనిపిస్తే అక్కడ మృగాళ్లు రెచ్చిపోతున్నారు, మదంతో కొందరు, మద్యంతో మరికొందరు, అధికారంతో భయపెట్టి ఇంకొందరు అఘాయిత్యాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే బెంబేలెత్తుతుంటే ఇప్పుడు మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

యూపీలోని లలిత్ పూర్ లో ఓ 13 ఏళ్ల మైనర్ ను కొందరు అగంతకులు కిడ్నాప్ చేశారు. ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. చివరికి ముష్కరుల బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ మైనర్.. తల్లి సాయంతో పోలీసు స్టేషన్ ను ఆశ్రయించింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిన విధానాన్ని వివరిస్తూ కేసు నమోదు చేయాలని పోలీసుల్ని కోరింది. అయితే ఆమెకు వారు భారీ షాకిచ్చారు. కేసు పెట్టకపోగా తిరిగి ఆ మైనర్ పై అత్యాచారం చేశారు. దీంతో కుమిలిపోవడం ఆమె వంతయింది.

minor raped by cop in police station while went to file rape case in uttar pradesh

ఉత్తరప్రదేశ్‌లో 13 ఏళ్ల దళిత అత్యాచార బాధితురాలు తనను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసినందుకు నలుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మళ్లీ అత్యాచారం చేశాడు. కిడ్నాప్ అయిన తర్వాత ఆగంతకులు ఆమెను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు తీసుకెళ్లారు. నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి తిరిగి ఇంటికి పంపేశారు. తిరిగి పీఎస్ లో అత్యాచారం తర్వాత బాలిక చైల్డ్‌లైన్ బృందానికి తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆమె అత్తతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేశారు.

ఈ ఘటనలో అత్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశామని. ఇతర నిందితుల జాడ కోసం దాడులు కొనసాగుతున్నాయని లలిత్‌పూర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ నిఖిల్‌ పాఠక్‌ తెలిపారు. బాధితురాలు మొదటిసారి ఏప్రిల్ 26 పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు అత్యాచారం కేసు ఎందుకు నమోదు చేయలేదనేది మా దర్యాప్తులో భాగంగా ఉందని లలిత్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు.

English summary
a 13 year minor has been allegedly raped by cops in uttar pradesh's lalitpur police station while she went to file rape case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X