కావేరీ వాటర్ ఫైట్: పెట్రోల్ బాంబులతో దాడి (వీడియో)
చెన్నై/బెంగళూరు: తమిళనాడులో కన్నడిగుల మీద కొందరు దాడులు చేస్తున్నారు. కన్నడిగులకు చెందిన వాహనాలు, కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు. చెన్నైలోని వుడ్ ల్యాండ్స్ హోటల్ మీద సోమవారం ఉదయం పెట్రోల్ బాంబులతో దాడి చేశారు.

గుర్తు తెలియన వ్యక్తులు కన్నడిగులను లక్షంగా చేసుకుని వుడ్ ల్యాండ్స్ హోటల్ మీద ఆరు పెట్రోల్ బాంబులు వేశారు. ఓ తమిళ యువకుడు కన్నడ నటీనటులను అవమానిస్తూ బెంగళూరులోని గిరినగరలో మాట్లాడాడు.
విషయం తెలుసుకున్న కన్నడిగులు ఆ తమిళ యువకుడికి దేహశుద్ది చేశారు. ఈ విషయం తెలుసుకున్న తమిళ ప్రజలు చెన్నైలో ప్రయాణిస్తున్న కర్ణాటక వాహనం (టూరిస్ట్ వాహనం) అడ్డుకుని అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు.

ప్రయాణికులను కిందకు దించి చితకబాదేశారు. బెంగళూరులోని తమిళ ప్రజల మీద దాడులు చేస్తే ఇక్కడ ఉన్న కన్నడిగులకు ఇదే గతి పడుతుందని తమిళనాడులో కరపత్రాలు ముద్రించి పంచుతున్నారు.
నామ్ తమిళర్ కచ్చి సంఘానికి చెందిన వారు కన్నడిగులపై దాడి చేశారని వెలుగు చూసింది. కన్నడిగులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పిస్తున్నామని చెన్నై నగర పోలీసు అధికారులు తెలిపారు.
#WATCH: Bus from Karnataka vandalised by Naam Tamilar Katchi party workers in Rameswaram, driver threatened #Cauvery pic.twitter.com/3til65O5jU
— ANI (@ANI_news) 12 September 2016












Click it and Unblock the Notifications