Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పట్టపగలు నగల షోరూమ్ లో అరాచకం, రివాల్వర్ తో ఓనర్ ను కాల్చేసి కేజీ నగలు లూటీ, పక్కాప్లాన్ తో !

బెంగళూరు: కస్టమర్ల ముసుగులో నగల దుకాణంలోకి చొరబడిన నలుగురు దుండగులు బంగారు (gold) నగల వ్యాపారిపై రివాల్వర్ తో కాల్పులు జరిపి కేజీ బంగారు ఆభరణాలను (jewelery) సినిమా స్టైల్లో అపహరించిన సంఘటన బెంగళూరు నగరంలోని బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.గొల్లరహట్టి సమీపంలోని వినాయక జ్యువెలర్స్‌లో నగలు లూటీ చేశారు.

దుండగులు రివాల్వర్ పేల్చడంతో బుల్లెట్‌ వ్యాపారి తొడలోకి దూసుకెళ్లి గాయం అయ్యిందని పోలీసులు అన్నారు. బంగారు నగల (jewelery) వ్యాపారి మనోజ్ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. మనోజ్ షాపులో ఒంటరిగా ఉన్న సమయంలో ఉదయం 10.45 గంటల సమయంలో దుండగులు చొరబడి ఈ చర్యకు పాల్పడ్డారని బెంగళూరు (Bengaluru) పోలీసులు తెలిపారు.

Miscreants escape with 1kg of gold jewelery after firing revolver at jewelery showroom owner in Bengaluru.

రాజస్థాన్‌కు చెందిన మనోజ్‌ పదేళ్లుగా గొల్లరహట్టిలో వినాయక జ్యువెలర్స్‌ (jewelery) పేరుతో బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. మనోజ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు దుకాణం తలుపులు తెరిచి వ్యాపారం ప్రారంభించి, రాత్రి 8 గంటలకు షాపు మూసివేసి వెళ్లిపోయేవాడని పోలీసులు అన్నారు. ఎప్పటిలాగే మనోజ్ ఉదయం 10 గంటలకు దుకాణం (jewelery) తలుపులు తెరిచాడు.

అయితే గురువారం వ్యాపారి మనోజ్ కు బ్లాక్ డే అయ్యిందని పోలీసులు తెలిపారు.ఉదయం 10.30 గంటల సమయంలో నలుగురు దొంగలు మనోజ్ దుకాణం దగ్గరకు రెండు బైక్‌లపై వచ్చారు. షాపులో మనోజ్ ఒక్కడే ఉన్నాడని నిందితులు నిర్ధారించుకున్నారు. ముందుగా బంగారం (jewelery) కొనుగోలు చేసేందుకు కస్టమర్ల ముసుగులో నగల దుకాణానికి ఇద్దరు వ్యక్తులు మాత్రమే వెళ్లారు.

Miscreants escape with 1kg of gold jewelery after firing revolver at jewelery showroom owner in Bengaluru.

మనోజ్ తన షాపుకు వచ్చేవారిని కస్టమర్లు అని అనుకున్నాడు.అప్పుడు నిందితులు ఆ డిజైన్‌ను చూపించి, ఇది చూపించు అంటూ బంగారు ఆభరణాలన్నింటినీ (jewelery) బయట తీసి పెట్టాలని చెప్పారు. ఆ సమయంలో అకస్మాత్తుగా మరో ఇద్దరు దుకాణంలోకి ప్రవేశించి వెంటనే బంగారు నగల (jewelery) షాపు షెల్టర్‌ను కిందకు లాగేశారు. మనోజ్‌ సాయం కోసం ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా మిగతా ఇద్దరు నిందితులు సి అతడి మెడపై వేటకొడవలి పెట్టి చంపేస్తామని బెదిరించారు.వెంటనే నగలు (gold) అన్నీ బ్యాగ్‌లో వేయమని నిందితులు షాపు యజమాని మనోజ్ కు చెప్పారు.

భయాందోళనకు గురైన మనోజ్ సుమారు 1 కిలో నగలను (jewelery) బ్యాగ్‌లో పెట్టాడు. బంగారు నగలు అన్ని బ్యాగ్ లో పెట్టుకున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. తర్వాత నగల (gold) షాపు షెల్టర్‌ని సగం తెరిచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లారు. ఈ దశలో ఇద్దరు వెళ్లిపోయిన తర్వాత మనోజ్ గట్టిగా కేకలు వేసి మరో ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.

Miscreants escape with 1kg of gold jewelery after firing revolver at jewelery showroom owner in Bengaluru.

దీంతో కోపోద్రిక్తుడైన ఓ దొంగ మనోజ్ తొడపై రివాల్వర్ తో ( revolver) కాల్చి అక్కడి నుంచి బయటపడి తప్పించుకోవాలని ప్రయత్నించారు. మనోజ్ కేకలు విని దుకాణం దగ్గర గుమిగూడిన స్థానికులను నిందితులు రివాల్వర్ తో (revolver) భయపెట్టి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. ఈ విషయం తెలియగానే పశ్చిమ అదనపు కమిషనర్‌ ఎన్‌.సతీష్‌కుమార్‌, డీసీపీ ఎస్‌.గిరీష్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

ఈ చోరీకి పాల్పడి నలుగురు దుండగులు వేర్వేరుగా తప్పించుకున్నట్లు పోలీసులు (police) అనుమానిస్తున్నారు. ఒక బృందం నగరం నుంచి నైస్ రోడ్డు మీదుగా బయలుదేరగా, మరో బృందం నగరంలోని సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్‌కు చేరుకుని బెంగళూరు నుంచి (Bengaluru) రైలులో పారిపోయినట్లు సమాచారం. మెజెస్టిక్, నైస్ రోడ్డు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.బంగారు ఆభరణాల (jewelery) దుకాణంలో జరిగిన చోరీ ఘటనపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని బెంగళూరు పశ్చిమ డివిజన్ డీసీపీ ఎస్.గిరీష్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+