రైల్వే ట్రాక్ పేల్చివేత: పేలుడుతో భారీ గుంత, ఎగిరిపడిన ట్రాక్
జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్‌గంజ్ జిల్లాలో దుండగులు రైల్వే ట్రాక్‌ను పేల్చేశారు. దీంతో రైల్వే ట్రాక్ కొంత భాగం దూరంలో ఎగిరిపడింది. రైల్వే శాఖ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ పేలుడు ఘటలో ఉగ్ర కోణం ఉందానే అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
సాహిబ్‌గంజ్ జిల్లా బార్హెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగ ఘుట్టు గ్రామం సమీపంలో లాల్మాటియా నుంచి ఫరక్కా వెళ్లే ఎంజీఆర్ రైల్వే లైన్‌పై దుండగులు పేలుడు పదార్థాలను అమర్చారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పేలుడు కారణంగా, రైల్వే ట్రాక్‌పై మూడు అడుగుల లోతైన బిలం ఏర్పడింది. ట్రాక్ అవశేషాలు సుమారు 39 మీటర్ల దూరంలో పడిపోయాయి. ఈ సంఘటన రంగ గుట్టు గ్రామ సమీపంలోని పోల్ నంబర్ 40/1 సమీపంలో జరిగింది.

కాగా, ఈ పేలుడు శబ్ధం ఎంజీఆర్ రైల్వే లైన్ పరిసర గ్రామాల ప్రజలకు కూడా వినిపించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. సంఘటన స్థలంలో పోల్ నంబర్ 42/02 వద్ద బొగ్గుతో కూడిన రైలు నిలిచిపోయింది. ఈ MGR లైన్ ద్వారా గొడ్డాలో లాల్మటియా నుంచి ఫరక్కా వరకు బొగ్గు రవాణా చేయబడుతుంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ అమిత్ కుమార్ సింగ్, బర్హర్వా డీఎస్పీ మంగళ్ సింగ్ జముదా, ఎన్టీపీసీ అసిస్టెంట్ ఇంజనీర్ షర్బత్ హుస్సేన్, జూనియర్ ఇంజనీర్ దేవయాన్, బార్హెట్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పవన్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. 15 మీటర్ల దూరంలో పేలుడుకు ఉపయోగించిన వైర్లను పోలీసులు గుర్తించారు. పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
🚨 SHOCKING 🚨: #Railway track blown up in #Jharkhand 💥
— Jharkhand Rail Users (@JharkhandRail) October 2, 2024
Authorities suspect explosives were used in the sabotage near Ranga Ghuttu village under #Berhait police station, #Sahibganj. Security agencies on high alert as the probe begins.
#Breaking #GandhiJayanti #Sabotage #Rail pic.twitter.com/e6UOscVQ5k
గత ఐదేళ్లుగా, నిషేధిత ఉగ్రవాద సంస్థ అస్సాంలోని నేషనల్ సంతాల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యక్తులు ఈ ప్రాంతాల్లో చురుకుగా ఉన్నారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పలు కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ అమిత్ కుమార్ సింగ్ తెలిపారు. పేలుడుకు ఉపయోగించిన పదార్థాన్ని తెలుసుకోవడానికి ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని పిలిపించారు. త్వరలోనే పోలీసులు ఓ నిర్ధారణకు రానున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications