పొరపాటున తుపాకీ పేలింది. కొడుకు చనిపోయాడని, తండ్రి ఆత్మహత్య,
పొరపాటున పేలిన తుపాకీ పేలడంతో కొడుకు చనిపోయాడని భావించిన తండ్రి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన కొచ్చిలో జరిగింది. మ్యాథ్యూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
కొచ్చి: ప్రమాదవశాత్తు జరిగిన ఘటన ఇద్దరి ప్రాణాలను తీసింది. తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొడుకు మరణించాడు. తన కుమారుడి మరణానికి తానే కారణమనే మనోవేధనకు గురైన తండ్రి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటన కేరళలో చోటుచేసుకొంది.
కేరళకి చెందిన మ్యాథ్యూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ ఆయన తుపాకీని శుభ్రం చేసుకోవడం అలవాటు. ప్రతి రోజూ మాదిరిగానే ఆదివారం నాడు కూడ మ్యాథ్యూ తన తుపాకీని శుభ్రం చేస్తుండగా ఆ తుపాకీ మిస్ ఫైర్ అయింది.ఈ ప్రమాదంలో తుపాకీకి ఎదురుగా ఉన్న మ్యాథ్యూ కొడుకు మును అక్కడికక్కడే చనిపోయాడు.

తుపాకీ మిస్ ఫైర్ తో కొడుకు చనిపోవడంతో మ్యాథ్యూ మనోవేదనకు గురయ్యాడు. తన కుమారుడిని తానే చంపుకున్నానని మధనపడ్డాడు. అదే తుపాకీని తీసుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
కాల్పుల శబ్ధం విన్న స్థానికులు మనును ఆసుపత్రికి తరలించడంతో ఆయన ప్రాణపాయం తప్పింది,. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. మ్యాథ్యూ మాత్రం అక్కడికక్కడే మరణించాడు.












Click it and Unblock the Notifications