వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమీషన్ కోసం ఆశపడి కోటి రూపాయాల నగదును మార్చి ఇచ్చాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్ణాటక :;రద్దైన పెద్ద నగదునోట్లను మార్పిడి చేసుకొనేందుకు బడాబాబులు అడ్డదారులు తొక్కుతున్నారు.బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించి పాత నగదును మార్చుకొంటున్నారు. కొత్త కరెన్సీ కోసం సామాన్యులు ఇక్కట్లు పడుతోంటే బడాబాబులు మాత్రం కమీషన్ ఆశచూపి తమ పనులు చక్కబెట్టుకొంటున్నారు.

కర్ణాటకలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ బ్యాంకు లో పరశిమూర్తి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. ఆయనను ఓ వ్యక్తి ఆశ్రయించారు. రద్దైన పాత నగదు నోట్లను మార్పిడి చేస్తే పెద్ద ఎత్తున కమీషన్ ఇస్తామని ఆశచూపారు.

mismanagement of cashier suspension in state bank of mysore

కమీషన్ కోసం పరశిమమూర్తి ఆశపడ్డాడు. కోటి రూపాయాల పాత నగదును మార్పిడి చేసేందుకు సిద్దపడ్డాడు. ఆదివారం బ్యాంకుకు సెలవైనా బ్యాంకు వచ్చి మరీ బడాబాబుకు పనిచేసిపెట్టాడు. కోటి రూపాయాల విలువైన పాత నగదు నోట్లను తీసుకొని కొత్త కోటిరూపాయాల నగదును ఓ వ్యక్తికి ఇచ్చాడు.

సోమవారం నాడు బ్యాంకుకు వచ్చిన అధికారులకు బ్యాంకులో ఉన్న రశీదులకు, నగదుకు మద్య చాలా వ్యత్యాసం కన్పించింది. ఈ వ్యత్యాసం తో సిసిటీవి పుటేజ్ ను చూశారు బ్యాంకు అధికారులు . ఈ పుటేజ్ లో పరశివమూర్తి బ్యాంకులోకి ప్రవేశించిన విషయాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే అతణ్ణి పిలిచి మాట్లాడారు. విషయం బయటపడింది.ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

English summary
parashivamurthy working as a cashier in state bank of mysore .if u exchange one crore rupees of banned currency , i wil pay comission offered to parashivamurthy. on sunday evening parashivamurthy exchange one crore, monday bank officers traceout this issue,. bank officers examine cc tv putage they identify cashier visuals, cashier suspend
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X