స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నా: మిస్ వరల్డ్ మానుషీకి గ్రాండ్ వెల్‌కం
మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత దేశానికి అందించిన మానుషి ఛిల్లర్‌కు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి ఘన స్వాగతం లభించింది. తెలివైన అందమైన అమ్మాయికి సుస్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు
ముంబై: మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత దేశానికి అందించిన మానుషి ఛిల్లర్‌కు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి ఘన స్వాగతం లభించింది.

ఇండియా.. ఇండియా అంటూ ఘన స్వాగతం
గత వారం చైనాలో నిర్వహించిన అందాల పోటీల్లో ఆమె భారత్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం ఆమె భారత్ వచ్చారు. ఆమెకు మంచి స్వాగతం లభించింది. అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేశారు.

మానుషీ చిల్లర్ ఉబ్బితబ్బిబ్బు
తెలివైన అందమైన అమ్మాయికి సుస్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఉబ్బితబ్బిబ్బయిన మానుషి చిల్లర్ మాట్లాడుతూ.. ఎంతో సంతోషంగా ఉందని, ఇంత గొప్ప స్వాగతం లభించినందుకు గర్వంగా ఉందని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న మానుషీ
మానుషీ చిల్లర్ సోమవారం దాదార్‌లోని సిద్ది వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆమెతో పాటు 2016 మిస్టర్ వరల్డ్ విజేత రోహిత్ ఖండేవాలా కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్‌తో కలిసి దిగిన ఫోటోలను మానుషి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ రోజు సిద్ధి వినాయకుడిని దర్శించుకొని, ఆశీస్సులు పొందినట్లు పేర్కొన్నారు.

ప్రతి దేశంలో స్నేహితులు
ప్రస్తుతం తనకు ప్రతి దేశంలో స్నేహితులు ఉన్నారని మానుషీ చిల్లర్ వేరుగా వ్యాఖ్యానించారు. తనకు స్వాగతం పలికినప్పుడు ఇండియా.. ఇండియా అని నినాదాలు చేయడం పట్ల స్పందిస్తూ... తన పేరు కంటే భారత్ పేరును ఉచ్చరించడం తనకు ఎంతో సంతోషమన్నారు.












Click it and Unblock the Notifications