విపక్షాల భేటీకి ముందు కాంగ్రెస్ మీట్-తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ లో గెలుపుపై రాహుల్ ధీమా..
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం చూపేందుకు పట్నాలో విపక్షాలు ఇవాళ నిర్వహిస్తున్న కీలక సమావేశానికి ముందు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలతో భేటీకి ముందు కాంగ్రెస్ సత్తా చూపేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పాట్నాలో విపక్షాల సమావేశానికి ముందు కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. త్వరలో జరిగే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, బీజేపీ ఎక్కడా కనిపించదని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 'భారత్ తోడో' సిద్ధాంతం ఉందని ఆన ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో తాను ఎక్కడికి వెళ్లినా, తాను బీహార్ ప్రజలను కలిశానన్నారు. వారందరూ మా భావజాలాన్ని విశ్వసించడం, దానిని లోతుగా అర్థం చేసుకుని తమతో చేరారని రాహుల్ తెలిపారు. దేశంలో బీజేపీ ద్వేషాన్ని, హింసను వ్యాపిస్తోందని, దీన్ని కాంగ్రెస్ ప్రేమతో ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు.

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి విపక్షం అవసరాన్ని ఖర్గే ప్రస్తావించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను బీహార్ నుండి ఎప్పటికీ విడదీయలేమని ఖర్గే తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని ఖర్గే గుర్తుచేశారు. బీహార్‌ను గెలిస్తే భారత్‌ను గెలవగలమని కాంగ్రెస్ నేతలకు ఖర్గే సూచించారు.
మరోవైపు ఢిల్లీలో పెత్తనం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా తమకు మద్దతివ్వకపోతే విపక్షాల భేటీకి రాలేమంటూ నిన్న కేజ్రివాల్ చేసిన హెచ్చరికలపై స్పందించిన మల్లిఖార్జున ఖర్గే .. దీనిపై పార్లమెంట్ సమావేశాలకు ముందే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడు దానిపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం లేదన్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications