Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ-టీడీపీని కలిపి కపిల్ సిబల్ డిన్నర్: అజెండా అదొక్కటే!

న్యూఢిల్లీ: కపిల్ సిబల్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి. ప్రస్తుతం దేశ రాజకీయాలన్నింటినీ ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకొన్న నేత. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఇచ్చిన డిన్నర్.. హాట్ టాపిక్‌గా మారింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి దూరంగా ఉంటోన్న రాజకీయ పార్టీల నేతలందరూ ఈ విందులో పాల్గొన్నారు. బీజేపీయేతర అన్ని పార్టీలనూ ఆయన ఏకతాటిపైకి తీసుకొచ్చారు ఈ డిన్నర్ వేదికగా. ప్రాంతీయ పార్టీలు ఈ డిన్నర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. ప్రత్యేకించి ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష తెలుగుదేశం.

పాల్గొన్న పార్టీల నేతలు వీరే..

పాల్గొన్న పార్టీల నేతలు వీరే..

వైఎస్సార్సీపీ, టీడీపీ సహా బీజేపీయేతర ప్రధాన పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేంద్ర మాజీమంత్రులు పీ చిదంబరం, శశిథరూర్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు డెరెక్ ఓ బ్రియాన్, నేషనలిస్ట్ కాంగ్రెకస్ పార్టీ నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, అకాలీదళ్ తరఫున నరేష్ గుజ్రాల్, బిజూ జనతా దళ్ నుంచి పినాకీ మిశ్రా తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ప్రధాన అజెండా..

ప్రధాన అజెండా..

2024లో ఎదురయ్యే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడం ఎలా?.. ఇదొక్కటే అజెండాగా ఆ డిన్నర్ మీటింగ్ సాగింది. నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏను ఓడించడానికి కాంగ్రెస్ సత్తా చాలదనేది కపిల్ సిబల్ అభిప్రాయం. అందుకే- బీజేపీయేతర పక్షాలన్నింటినీ కలుపుకోవాల్సి ఉంటుందనేది ఆయన వాదన. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాసిన కపిల్ సిబల్.. ఈ డిన్నర్ మీటింగ్‌లోకూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటూ జాతీయ మీడియా తెలిపింది. పీ చిదంబరం, శశిథరూర్‌ ఇందులో జాయిన్ కావడం వెనుక ఉన్న కారణం కూడా అదేనని పేర్కొంది.

కాంగ్రెస్ నాయకత్వ మార్పుపైనా

కాంగ్రెస్ నాయకత్వ మార్పుపైనా

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ నేతృత్వాన్ని వహిస్తోన్నారు. ఆమె తాత్కాలిక అధినేత్రిగా కొనసాగుతోన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పగ్గాలను అందుకోవడానికి అనాసక్తిని ప్రదర్శించడం వల్ల కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్‌కు. అప్పటిదాకా సోనియా గాంధీ కొనసాగుతారు. గాంధీయేతర కుటుంబానికి చెందిన నేతలకు పార్టీ పగ్గాలను అప్పగించాలని భావించినప్పటికీ.. మెజారిటీ పీసీసీ అధ్యక్షులు దీనికి సుముఖంగా లేరు. ప్రత్యామ్నాయంగా వారి చూపంతా ప్రియాంకాగాంధీ వైపు ఉంది. ఈ విషయాన్ని బాహటంగా చెప్పలేని పరిస్థితిని వారు ఎదుర్కొంటోన్నారు.

నాయకత్వం మారితే గానీ..

నాయకత్వం మారితే గానీ..

కాంగ్రెస్ నాయకత్వం మారితే గానీ.. 2024లో కాంగ్రెస్‌కు విజయం దక్కదనే అభిప్రాయాన్ని కపిల్ సిబల్ ఇచ్చిన డిన్నర్‌లో పలువురు నేతలు అభిప్రాయపడినట్లు జాతీయ మీడియా పేర్కొంది. బలమైన ఎన్డీఏ కూటమిని ఢీ కొట్టడానికి ఛరిష్మా గల నేతలు అందుబాటులో లేరని మెజారిటీ నాయకులు స్పష్టం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత 2024 నాటి లోక్‌సభ ఎన్నికల ఫలితం, దాని తీరుతెన్నులు ఎలా ఉండబోతాయనే విషయంపై ఒక స్పష్టత వస్తుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

యూపీలో గెలవలేం..

యూపీలో గెలవలేం..

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేదనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడగా.. మిగిలిన పార్టీల నాయకులు దాన్ని అంగీకరించారు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీని ఢీ కొట్టే సత్తా ఉన్న పార్టీ సమాజ్ వాది ఒక్కటే కావడం వల్ల- ఆ పార్టీకి కాంగ్రెస్ సహకరించడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ- తాము పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదని ఇది వరకే నిర్ణయం తీసుకున్నామని, కలిసి వచ్చే చిన్న పార్టీలతోనే ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓట్లు చీలకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ.. తప్పనిసరిగా సమాజ్‌వాది పార్టీకి సహకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి.

 ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా..

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా..

ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా ఉంటే బీజేపీ దూకుడు కళ్లెం వేసే విషయంలో ఘోరంగా విఫలమౌతామని, అందుకే ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ..ఉమ్మడి శతృవును ఓడించడానికి ఏకం కాక తప్పదని కపిల్ సిబల్ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఎన్డీఏ దూకుడును అడ్డుకోవడానికి ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తి ఏర్ప‌డాల్సిన అవసరం ఉందని.. దానికి ఎవరు సారథ్యాన్ని వహిస్తారనే ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం దొరక్కపోవచ్చని అన్నారు. అనేక కారణాల వల్ల ఎన్డీఏ బలహీన పడిందని, ఈ సారి సమర్థవంతమైన ప్రత్యామ్నాయ వేదిక అంటూ ఏర్పడగలిగితే- బీజేపీ.. దాని సారథ్యంలోని ఎన్డీఏను ఓడించడం తథ్యమని కపిల్ సిబల్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

Recommended Video

    Eta Variant In India ఇప్పటికే పలు వేరియంట్లు | Kerala | COVID 19 Vaccination || Oneindia Telugu
     వైసీపీ, టీడీపీల వైఖరేంటీ?

    వైసీపీ, టీడీపీల వైఖరేంటీ?

    ఈ డిన్నర్ మీటింగ్‌కు వైసీపీ, టీడీపీ ప్రతినిధులు సైతం హాజరయ్యారని జాతీయ మీడియా స్పష్టం చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తమ ప్రధాన డిమాండ్ అని.. దాన్ని నెరవేర్చిన ఏ కూటమి అయినా సరే.. అటు ఎన్డీఏ లేదా.. యూపీఏ లేదా.. ప్రత్యామ్నాయ కూటమికి తాము మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని వైసీపీ నాయకులు స్పష్టం చేసినట్లు సమాచారం. టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించే తన వాదనలు, అభిప్రాయాన్ని వినిపించినట్లు తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+