వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషన్‌ ఆక్సిజన్‌ : ఆస్పత్రులకు సంజీవనిలా టెలీమెడిసిన్‌ యాప్‌ స్వస్ధ్‌

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సాగుతోంది. గతేడాదితో పోలిస్తే వేగంగా పెరిగిపోతున్న కేసులు, వనరుల కొరత, ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రులు అల్లాడుతున్నాయి. దీంతో సహజంగానే ఈ ప్రభావం రోగులపై పడుతోంది. ప్రభుత్వాల నుంచి సాయం కోసం ఆస్పత్రులతో పాటు రోగులు కూడా ఎదురుచూడాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. దీంతో స్వస్త్‌ వంటి యాప్‌లు ఆక్సిజన్ కొరత తీర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆక్సిజన్‌ సరఫరాదారులతో సమన్వయం చేసుకుంటూ రోగుల్ని ఆదుకుంటున్నాయి.

Recommended Video

Karnataka Lockdown : EC Responsible For Second Covid Wave - Madras High Court | Oneindia Telugu
 ఆక్సిజన్ కొరత తీరుస్తున్న స్వస్త్‌ యాప్‌

ఆక్సిజన్ కొరత తీరుస్తున్న స్వస్త్‌ యాప్‌

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న ఆస్పత్రులను ఆదుకునేందుకు స్వస్త్‌ యాప్ ముందుకొచ్చింది. టెలీమెడిసిన్ సేవల కోసం ప్రారంభించిన ఈ యాప్‌ ఇప్పుడు ఆక్సిజన్‌ కొరత ఎదుర్కొంటున్న ఆస్పత్రుల పాలిట సంజీవనిగా మారిపోయింది. మిలాప్‌, కెట్టో, ఇంపాక్ట్ గురు క్యాంపెయిన్ల నిర్వహణతో ఆక్సిజన్‌ కొరత తీరుస్తోంది. వాస్తవానికి భారత్‌లో ఆక్సిజన్ తయారీ దారుల సంఖ్య తక్కువ. దీంతో యువెల్‌, బీపీఎల్‌, మెడిక్విన్‌, నిడెక్‌, సాన్రాయ్ వంటి కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్ అందిస్తోంది.

 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు

ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు

ఆస్పత్రుల్లో ప్రస్తుతం నెలకొన్న డిమాండ్‌ ఏ స్ధాయిలో ఉందంటే ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు కావాలంటూ స్వస్త్‌ యాప్‌కు కొన్ని గంటల్లోనే 10వేల విజ్ఞప్తులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 2 లక్షల ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ల అవసరం ఉందని అంచనా. దీంతో ప్రస్తుతం వచ్చిన విజ్ఞప్తుల మేరకు 10 వేల ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ల కోసం 10 మిలియన్ల డాలర్ల నిధిని సేకరించాలని స్వస్త్‌ యాప్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ప్రయత్నంలో సహకరించేందుకు ఆసక్తిఉన్న వారి కోసం కూడా ఎదురుచూస్తోంది.

 ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ల ధరలివే

ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ల ధరలివే

ప్రస్తుతం ఒక్కో హై ఫ్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌ ధర రూ.85 వేలు కాగా ... లో ఫ్లో కాన్‌సన్‌ట్రేటర్ ధర రూ.45 వేలు ఉంది. ఒక్కో హై ఫ్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌ వాడకం ద్వారా 530 మంది రోగులకు చికిత్స అందించేందుకు వీలు కలుగుతుంది. ఒక్కో లో ఫ్లో కాన్‌సన్‌ట్రేటర్

ద్వారా స్వల్ప లక్షణాలు కలిగిన 900 మంది రోగులకు వైద్యం అందించవచ్చు. దీంతో ఈ కాన్‌సన్‌ట్రేటర్ల కోసం ఆస్పత్రులు తపిస్తున్నాయి. వీటిని తక్షణం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చే అవకాశాలు లేకపోవడంతో స్వస్త్ యాప్‌ నిర్వాహకులు వీటిని విరాళాల ద్వారా కొనుగోలు చేసే పనిలో ఉన్నారు.

 ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్ల దానానికి మార్గాలివే

ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్ల దానానికి మార్గాలివే

ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లను విరాళంగా ఇవ్వాలనుకునే వారికి ఆదాయపుపన్ను చట్టం సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వీటిని విరాళంగా ఇవ్వాలనుకునే వారు ఇంపాక్ట్ గురూ వెబ్‌సైట్ ద్వారా https://www.impactguru.com, మిలాప్‌ వెబ్‌సైట్ ద్వారా https://www.milaap.org ద్వారా, విదేశాల్లో ఉండే వ్యక్తులైతే https://www.milaap.org/fundrisers/donatefor-oxygen వెబ్‌సైట్లలో విరాళాలు అందించవచ్చు. భారీ ఎత్తున విరాళాలు అందించేవారైతే దేశ విదేశాల్లో ఉన్నా.. subhaswastthapp.org ద్వారా సంప్రదించవచ్చు.

సీఎస్ఆర్‌ నిధులు ఇవ్వాలనుకునే వారు, దీర్ఘకాలం ఈ యాప్‌తో అనుబంధం కొనసాగంచాలకునే వారు కూడా పై అడ్రస్ ద్వారా సంప్రదించవచ్చు.

ప్రారంభ అవసరం క్రింద ఇవ్వబడింది: ప్రతి అధిక ప్రవాహ ఆక్సిజన్ సాంద్రతకు రూ. 85,000 మరియు ప్రతి తక్కువ ప్రవాహ సాంద్రతకు రూ .45,000 ఖర్చవుతుంది. Flow అధిక ప్రవాహ సాంద్రతకు రూ .85000 / $ 1130 ఖర్చవుతుంది మరియు తీవ్రమైన లేదా క్లిష్టమైన అనారోగ్యంతో 550 మంది రోగులకు చికిత్స చేస్తారు. Flow తక్కువ ప్రవాహ సాంద్రతకు రూ .45000 / $ 600 ఖర్చవుతుంది మరియు తేలికపాటి నుండి మితమైన అనారోగ్యంతో 900 మంది రోగులకు చికిత్స చేయవచ్చు

భారతదేశంలోని వ్యక్తులు: ఈ రచనలు సెక్షన్ 80 జి కింద భారతీయ పౌరులకు పన్ను ప్రయోజనాలకు అర్హులు

English summary
As India is battling the resurging of COVID cases, Hospitals and healthcare providers are running out of resources in the fight against COVID-19 and the situation on the ground is dire. Hospitals urgently need more oxygen cylinders and concentrators to save as many lives as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X