Mithun Chakraborty: నటుడు మిథున్ చక్రవర్తికి సువేందు కేబినెట్ ర్యాంక్ పోస్టు..!

ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సువేందు అధికారి పాలనపై తనదైన మార్కు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న సువేందు.. ఇవాళ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రముఖ నటుడు, బీజేపీ నేత కూడా అయిన మిథున్ చక్రవర్తిని (Mithun Chakraborty) ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ సీఎం సువేందు ఆదేశాలు ఇచ్చారు.

బెంగాల్లో బీజేపీకి ఊహించని కొత్త ప్రత్యర్థి? టీఎంసీ, కాంగ్రెస్, లెఫ్ట్ బలహీనపడ్డ వేళ..!
బెంగాల్లో బీజేపీకి ఊహించని కొత్త ప్రత్యర్థి? టీఎంసీ, కాంగ్రెస్, లెఫ్ట్ బలహీనపడ్డ వేళ..!

సువేందు అధికారి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సలహాదారుడిగా మిథున్ చక్రవర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఆయనకు కేబినెట్ మంత్రి ర్యాంక్ కూడా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖలో ఆయనకు ఈ పదవి ఇచ్చారు. సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖలో మిథున్ చక్రవర్తి క్యాబినెట్ మంత్రి హోదాను చేపట్టబోతున్నారు. బెంగాల్ సాంస్కృతిక, సినీ రంగాలపై బీజేపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మిథున్ చక్రవర్తిని ఈ పదవిలో నియమించారు.

Mithun Chakraborty Appointed Bengal Govt Advisor With Cabinet Rank
ముస్లిం మహిళా ఐపీఎస్ పై సువేందు వేటు..! ఇస్లాం పదాల వాడకంపై- రాజకీయ దుమారం..!
ముస్లిం మహిళా ఐపీఎస్ పై సువేందు వేటు..! ఇస్లాం పదాల వాడకంపై- రాజకీయ దుమారం..!

ప్రముఖ బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో సీఎం సువేందు అధికారి ఈ మేరకు ప్రకటన చేశారు. బెంగాల్ సినీ వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్రాన్ని ఒక ప్రధాన సాంస్కృతిక, సినీ కేంద్రంగా పునరుద్ధరించడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రచారం చేస్తోంది. దీంతో భారతీయ సినిమా రంగంలో సుపరిచితుడైన మిథున్ చక్రవర్తిని కేబినెట్ ర్యాంక్ పదవితో గౌరవించింది. బీజేపీ తరపున చురుకైన ప్రచారకర్తగా , పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఉన్న మిథున్ చక్తవర్తి ఇకపై కొత్త పాత్రలో దర్శనమివ్వబోతున్నారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం తన సాంస్కృతిక, పాలనాపరమైన సొంత అజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో, మిథున్ నియామకం జరిగినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+