కాంగ్రెస్‌కు మిజోరాంలో ఊరట: హస్తగతైన రాష్ట్రం
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సాయంత్రం వరకు లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ 33 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి మిజోరం ఫలితాలు కొంతలో కొంత ఊరట అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి లాల్ తన్హాల్వా తన సొంత నియోజకవర్గం సెర్చీఫ్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎంఎన్ఎఫ్ అభ్యర్థి సి లాల్ రామ్ జావాపై 734 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన్హాల్వాకు 5719, లాల్ రామ్ జావాకు 4985 ఓట్లు వచ్చాయి.

కాంగ్రెసు 33 స్థానాల్లో గెలవగా మిజోరాం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) రెండో స్థానంలో ఉంది. నలభై స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 142 మంది పోటీ పడ్డారు. నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి.












Click it and Unblock the Notifications