సీఎం: స్టాలిన్ వ్యూహం మారింది: రెబల్ ఎమ్మెల్యేలతో అధికారంలోకి ? పళని, పన్నీర్ టెన్షన్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రసవత్తర రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మెజారిటీ లేదని, వెంటనే శాసన సభలో బలపరీక్ష నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ కు ప్రతిపక్షాలు మనవి చేశాయి.

శశికళకు చెక్: దేవుడు వచ్చినా ఆపలేరు, మోనంగా సీఎం పళనిసామి, పన్నీర్ స్కెచ్!

పళనిసామి ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవడానికి ఒక్క వారం గడువు ఇస్తున్నామని, అంతలోపు గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ స్పంధించకపోతే న్యాయ, ప్రజా పోరాటం చేస్తామని డీఎంకే పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎం.కే. స్టాలిన్ హెచ్చరించారు.

రాజ్ భవన్ వైపు చూడం

రాజ్ భవన్ వైపు చూడం

గవర్నర్లు రాజకీయ జోక్యం గురించి ఇది వరకు కోర్టులు ఇచ్చిన ఆదేశాలను గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ కు లిఖితపూర్వకంగా వివరించామని, ఆయన కచ్చితంగా ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి బలపరీక్ష నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తారని భావిస్తున్నామని, ఇక ముందు రాజ్ భవన్ వైపు కన్నెత్తిచూడమని స్టాలిన్ అన్నారు.

మెజారీటి మావైపు ఉంది

మెజారీటి మావైపు ఉంది

ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి 21 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉప సంహరించుకున్నారని, ఆయనకు కేవలం 114 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని స్టాలిన్ గుర్తు చేశారు. కనీసం 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని నడిపించాలని స్టాలిన్ చెప్పారు.

స్టాలిన్ లెక్కలు ఇవే

స్టాలిన్ లెక్కలు ఇవే

డీఎంకే పార్టీకి 89 మంది, కాంగ్రెస్ 9 మంది, ముస్లీం లీగ్ పార్టీకి ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 21 మంది ఉన్నారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య 119 ఉంది. అంటే ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారని, అందుకే బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామని స్టాలిన్ అంటున్నారు.

స్టాలిన్ వ్యూహం మారింది

స్టాలిన్ వ్యూహం మారింది

దొడ్డిదారిలో తాము అధికారంలోకిరామని ఇంతకాలం చెబుతూ వచ్చిన స్టాలిన్ ఇప్పుడు ఒక్క సారిగా వ్యూహం మార్చారు. దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలతో కలుపుకుని మెజారిటీ శాసన సభ్యులు మావైపు ఉన్నారని మాట్లాడటంతో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కూల్చి దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలతో కలిసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పళనిసామి, పన్నీర్ స్కెచ్

పళనిసామి, పన్నీర్ స్కెచ్

టీటీవీ దినకరన్ గ్రూప్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎలాగైనా గాలం వేసి తమిళనాడులో అధికారంలో ఉండాలని సీఎం. పళనిసామి, పన్నీర్ సెల్వం స్కెచ్ వేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, వారి బంధువులతో పలువురు మంత్రులు మంతనాలు జరుపుతున్నారని సమాచారం. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Governor Ch. Vidyasagar Rao to immediately direct Chief Minister K Palaniswami to prove his majority in the Assembly in the wake of revolt by 19 AIADMK MLAs, saying any delay could lead to horse trading said Stalin.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X