ప్రభుత్వం నడిచేలా చూడండి: గవర్నర్‌కు స్టాలిన్, శశికళకు ఝలక్

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకొనే దిశగా పన్నీర్ సెల్వం, శశికళల మధ్య ఉత్కంఠ నెలకొంది.

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకొనే దిశగా పన్నీర్ సెల్వం, శశికళల మధ్య ఉత్కంఠ నెలకొంది.

ఇంచార్జి గవర్నర్‌ విద్యాసాగర రావు నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే కోశాధికారి స్టాలిన్‌ గవర్నర్‌తో శుక్రవారం భేటీ అయ్యారు.

పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్న స్టాలిన్‌ గవర్నర్‌తో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు డీఎంకే మద్దతు ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

గవర్నర్‌తో భేటీ అనంతరం స్టాలిన్ మాట్లాడారు. 9 నెలలుగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉందన్నారు. గవర్నర్ కల్పించుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నడిచేలా చూడాలన్నారు. గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నారు. గవర్నర్ శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వం నడిచేలా చూడాలి చెప్పడం ద్వారా పన్నీరు వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది.

MK Stalin meets Governor Vidyasagar Rao

ఇతర రాష్ట్రాలకు ఎమ్మెల్యేలు

శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు ప్రస్తుతం రిసార్టులలో ఉన్నారు.

గవర్నర్ నివేదిక రాలేదు

ఇంచార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర రావు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌తో సెల్వంతో, ఆ తర్వాత అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళతోనూ భేటీ అయ్యారు. దీంతో బంతి రాజ్‌భవన్‌ కోర్టులో పడింది.

అయితే ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

అలాగే, ఆయన గురువారం రాత్రి రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖలకు వేర్వేరు నివేదికలు పంపారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ సంక్షోభంపై తమకెలాంటి నివేదిక ఇప్పటివరకు అందలేదని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+