మైసూర్ కలెక్టర్ గా పని చేసిన రోహిణి సింధూరిపై ఎమ్మెల్యే 100 రూపాయల పరువు నష్టం దావా.. రీజన్ ఇదే !!
కర్ణాటక కేడర్ తెలుగు ఐఏఎస్ అధికారిణి, ముక్కుసూటిగా వ్యవహరించే ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న రోహిణి సింధూరిపై వంద రూపాయల పరువు నష్టం దావా వేశారు. దేవాదాయ శాఖకు బదిలీ అయిన మైసూరు జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి పై అదే జిల్లాకు చెందిన జేడీఎస్ పార్టీ మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే సారా మహేష్ వంద రూపాయల పరువు నష్టం దావా వేయటం కర్ణాటక రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది.

రోహిణీ సింధూరిపై కోర్టుకెక్కిన ఎమ్మెల్యే సారా మహేష్
మైసూరు జిల్లా కలెక్టర్ గా రోహిణి సింధూరి పనిచేసిన ఏడెనిమిది నెలల పాటు అనేక వివాదాలు చెలరేగాయి.సారా మహేష్ కు, రోహిణి సింధూరి కి మధ్య వివాదాలు కోర్టుల దాకా చేరాయి. చామరాజనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు 24 మంది మృతి చెందిన ఘటనకు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి కారకురాలు అని సారా మహేష్ గతంలో ఆరోపణలు గుప్పించారు. ఆక్సిజన్ చేరవేయడంలో జాప్యం చేయడం వల్లనే వారు చనిపోయారని సారా మహేష్ పేర్కొన్నారు.

మైసూర్ కలెక్టర్ గా ఉన్నప్పుడు వారి మధ్య వరుస వివాదాలు
ఇక ఈ వివాదం పై ఇద్దరూ రిటైర్డ్ న్యాయమూర్తుల విచారణలో కోవిడ్ బాధితుల మృతి ఘటనకు, మైసూరు జిల్లా అధికారి రోహిణి సింధూరికి ఏ విధమైన సంబంధం లేదని తేల్చి చెప్పారు.ఈ క్రమంలో రోహిణి సింధూరి పై ఆరోపణలు చేసిన సారా మహేష్ జిల్లా ప్రజలకు, అధికారులకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ వినిపించింది. ఆ తర్వాత వరుస వివాదాలు వారిద్దరి మధ్య కొనసాగుతూనే ఉన్నాయి. సారా మహేష్ కు చెందిన కళ్యాణమండపం రాజ కాలువపై ఉందని జిల్లా అధికారి హోదాలో రోహిణి సింధూరి దానిపై దర్యాప్తు చేయించారు.

రోహిణీ సింధూరిపై వంద రూపాయల పరువు నష్టం దావా
అయితే రెవిన్యూ శాఖ దర్యాప్తులో అక్రమాలు చోటు చేసుకోలేదని తేలింది. ఆ తర్వాత తారా మహేష్ తో పాటు ఆయన భార్య కు చెందిన ఆస్తులను విచారించాలని రోహిణి సింధూరి మైసూర్ అభివృద్ధి ప్రాధికార సంస్థకు లేఖ రాశారు. ఇప్పుడు సారా మహేష్ ఆమెపై వంద రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఇక తాజాగా విధి నిర్వహణలో నిక్కచ్చిగా ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారంటూ గుర్తింపు తెచ్చుకున్న రోహిణి సింధూరిపై యడ్యూరప్ప సర్కార్ బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం ఆమె దేవాదాయశాఖ కమిషనర్ గా పని చేస్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications