మాజీ సీఎంతో గడిపిన పాతరోజులు గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, ఆరోజుల్లో అలా జరిగింది

కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీ. ఎస్. యడ్యూరప్పకు కర్ణాటక మాజీ మంత్రి, కేఆర్ పీ పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి జానారెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో కర్ణాటకలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన రోజులను గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 27వ తేదీ మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప పుట్టినరోజు.

మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప 81వ జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి విరామం తీసుకున్న యడ్యూరప్ప పార్టీ నిర్వహణలో, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో నిమగ్నం అయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి, కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ వ్యవస్థాపకుడు, గంగావతి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బి. ఎస్. యడ్యూరప్పకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

MLA Gali Janardhan Reddy remembers the old days spent with former CM BS Yeddyurappa

గాలి జనార్దన్ రెడ్డి ఆయన ఫేస్‌బుక్‌లో మంగళవారం ఓ పోస్ట్‌ చెయ్యడంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది. పేదల పక్షపాతి, రైతు నాయకుడు, మనందరికీ ప్రియ మిత్రుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని రాశారు. బీఎస్ యడ్యూరప్ప కర్ణాటక రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రిగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పనిచేశారని, రాష్ట్రంలో ఆయనను ప్రముఖ వ్యక్తిగా మారారని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు.

కర్ణాటక రాష్ట్ర రాజకీయ చరిత్రలో దృఢమైన నిర్ణయాలతో తనదైన ముద్ర వేసిన మహానేత, మన మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. బీఎస్ యడ్యూరప్పతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని, 2008లో దక్షిణ భారతదేశంలో మొదటిసారి కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్రంలోని వందకు పైగా నియోజకవర్గాల్లో ఆయనతో కలిసి ప్రచారం నిర్వహించి రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు సేవ చేశానని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి తాను కూడా ఆనందంగా సంబరాలు చేసుకున్నానని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో యడ్యూరప్పతో పలుమార్లు వేదికను పంచుకోవడం, మా కుటుంబ కార్యక్రమాల్లో ఆయన చాలాసార్లు పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

MLA Gali Janardhan Reddy remembers the old days spent with former CM BS Yeddyurappa

కర్ణాటక ప్రజలకు ఇష్టమైన ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప చెరగని ముద్రవేసుకున్నారని, ఆయన జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, కీర్తిని ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. 2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

తరువాత కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తరువాత బీజేపీకి అధికారంలోకి రావడంతో బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2021 జూలై 26వ తేదీన యడ్యూరప్ప వయసు రీత్యా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎన్నికల రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం యడియూరప్ప కుమారుడు బీవై.విజయేంద్ర శికారిపుర నియోజకవర్గం ఎమ్మెల్యేగా, మరో కొడుకు బీవై రాఘవేంద్ర శివమొగ్గ ఎంపీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+