Rebel MLAs: ఏక్ నాథ్ షిండే రెబల్ ఎమ్మెల్యేల స్టార్ హోటల్ బిల్లు ఎంతంటే ?, హోటల్ లో ?!

గుహవాటి/ముంబాయి: మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణం అయిన ఏక్ నాథ్ షిండే వర్గంలోని రెబల్ ఎమ్మెల్యేలు మూడు రోజుల క్రితం వరకు గుహవాటిలోని స్టార్ హోటల్ లో ఉన్న విషయం తెలిసిందే. 50 మంది రెబల్ ఎమ్మెల్యేల కోసం గుహవాటిలోని రాడిసన్ బ్లూ స్టార్ హోటల్ మొత్తం బుక్ చేశారు. హోటల్ లో ఉన్న 70 రూమ్ లు మొత్తం బుక్ చేసుకున్న రెబల్ ఎమ్మెల్యేలు ఆ హోటల్ లోకి బయటవాళ్లు ఎవ్వరూ రాకుండా చూసుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు హోటల్ లో ఉన్న సమయంలో బిల్లు ఎన్ని లక్షలు అయ్యింది ? అని ఇంతకాలం జోరుగా చర్చ జరిగింది. స్టార్ హోటల్ లో రెబల్ ఎమ్మెల్యేలే ఎలాంటి విలాసవంతమైన జీవితం గడిపారు ?, హోటల్ లో ఏమేమి చేశారు ?, హోటల్ బిల్లు ఎంత అయ్యింది ?, అనే విషయంలో ప్రముఖ జాతీయ మీడియా క్లారిటీ వచ్చింది.

 రాడిసన్ బ్లూ స్టార్ హోటల్

రాడిసన్ బ్లూ స్టార్ హోటల్

మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణం అయిన ఏక్ నాథ్ షిండేతో పాటు ఆయన వర్గంలోని రెబల్ ఎమ్మెల్యేలు గుహవాటిలోని స్టార్ హోటల్ లో ఉన్న విషయం తెలిసిందే. రాడిసన్ బ్లూ హోటల్ లో రెబల్ ఎమ్మెల్యేలు తప్పా ఇతరులు ఉండటానికి అవకాశం లేకుండా పోయింది.

 రెబల్ ఎమ్మెల్యేలు హోటల్ లో ఏం చేశారంటే ?

రెబల్ ఎమ్మెల్యేలు హోటల్ లో ఏం చేశారంటే ?

స్టార్ హోటల్ లో రెబల్ ఎమ్మెల్యేలు విలాసవంతమైన జీవితం గడిపి ఎంజాయ్ చేశారని ఇటీవల శివసేనకు చెందిన ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని కొందరు నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు హోటల్ లో ఉన్న సమయంలో బిల్లు ఎన్ని లక్షలు అయ్యింది ? అని ఇంతకాలం జోరుగా చర్చ జరిగింది.

 ఒక్కో రూమ్ అద్దె ఎంతంటే ?

ఒక్కో రూమ్ అద్దె ఎంతంటే ?

రాడిసన్ బ్లూ స్టార్ హోటల్ లోని మొత్తం 70 రూమ్ లు 60 మంది రెబల్ ఎమ్మెల్యేల కోసమే బుక్ చేశారు. రాడిసన్ బ్లూ హోటల్ లో డీలెక్స్ రూమ్ కు ప్రతిరోజు రూ. 8, 500, మామూలు రూమ్ కు రూ. 7, 500 చొప్పన అద్దె వసూలు చేస్తుంటామని, అయితే రెబల్ ఎమ్మెల్యేలకు డిస్కౌంట్ ఇచ్చి రూమ్ లు ఇచ్చామని ఆ హోటల్ కు చెందిన ఓ సీనియర్ అధికారి పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.

 మొత్తం రూ. 68 లక్షలు బిల్లు

మొత్తం రూ. 68 లక్షలు బిల్లు

రెబల్ ఎమ్మెల్యేలు జూన్ 22వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు హోటల్ లో ఉన్నారని, రూమ్ లు మొత్తం వాళ్లకే కేటాయించామని, మొత్తం హోటల్ రూమ్ లు అద్దె మొత్తం రూ. 68 లక్షలు చెల్లించారని చెప్పారని, ఒక్కరూపాయి కూడా వారు అప్పు పెట్టలేదని, మొత్తం బిల్లు చెల్లించారని రాడిసన్ బ్లూ హోటల్ కు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

 ఫుడ్ కు రూ. 22 లక్షలు, స్పా సెంటర్ లో నిల్

ఫుడ్ కు రూ. 22 లక్షలు, స్పా సెంటర్ లో నిల్

రెబల్ ఎమ్మెల్యేల ఆహారం, ఫుడ్ కు మాత్రమే రూ. 22 లక్షలు అయ్యిందని హోటల్ అధికారి వివరించారు. అయితే హోటల్ లో రెబల్ ఎమ్మెల్యేలు సాదారణ వ్యక్తులు ఎలా ఉంటారో అలాగే ఉన్నారని, హంగులు, అర్బాటాలకు పోలేదని, ఒక్కరు కూడా హోటల్ లో స్పా (మసాజ్) చేయించుకోలేదని హోటల్ అధికారి వివరించారని పీటీఐ వార్తా సంస్థ వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+