నాగా కాల్పులు: మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత, సిట్‌తో దర్యాప్తు

నాగాలాండ్ కాల్పుల ఘటన హీటెక్కిస్తోంది. 13 మంది పౌరులు, జవాను మృతిపై అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. భద్రతా దళాల దుందుకుడు చర్యను అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఆర్మీలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తామని అధికారులు వివరించారు. చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇటు రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. హింసాత్మక ఘటనలు జరుగుతాయోమోననే అంచనాతో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా బంద్ లాంటి పరిస్థితి నెలకొంది. కోహిమాలో ప్రముఖ పండుగను కూడా జరుపుకోవడం లేదు. ఇటు హింసను ప్రేరేపిస్తారనే అంచనాతో మొబైల్ ఇంటర్నెట్, మెసేజ్ సేవలను నిలిపివేశారు. ఘటనపై దర్యాప్తును సిట్ చేపట్టనుంది.

రాహుల్ గాంధీ రియాక్షన్

రాహుల్ గాంధీ రియాక్షన్

కాల్పుల ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. 13 మంది పౌరులు, ఓ జవాన్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఈ అంశంపై కేంద్ర కచ్చితంగా వివరణ ఇచ్చి తీరాలన్నారు​. అసలు హోం మంతిత్వ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. దేశంలో పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారా? అని నిలదీశారు.

విధులు ముగించుకొని వస్తోన్న కార్మికులు

విధులు ముగించుకొని వస్తోన్న కార్మికులు

నాగాలాండ్​ మయన్మార్ సరిహద్దు జిల్లా అయిన మోన్​లో మిలిటెంట్ల కదలికలు గుర్తించినట్లు సమాచారం అందింది. సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ.. అప్పుడే బొగ్గు గనిలో విధులు ముగించికుని వెళ్తున్న కార్మికులు అటుగా వచ్చినట్లు తెలిసింది. ఈ సమయంలో జరిపిన కాల్పులతో 13 మంది పౌరులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, నాగాలాండ్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేశారు. విచారణ జరిపిస్తామని స్పష్టం చేశాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాయి.

స్థానికుల ఆగ్రహాం

స్థానికుల ఆగ్రహాం

మిలిటెంట్లుగా భావించి జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న సాయంత్రం మోన్ జిల్లా ఓటింగ్‌లో జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలిటెంట్ల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. అదే సమయంలో పనులు ముగించుకుని వస్తున్న కార్మికులను మిలిటెంట్లుగా పొరబడిన భద్రతా దళాలు ఒక్కసారిగా కాల్పులు జరిపాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు భద్రతా దళాల వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పౌరుల మృతిపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయ్‌ప్యూ విచారం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+