వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడ్రన్ 'సత్యభామ' వీడియో

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

భర్తను చంపడానికి వస్తే భార్య గన్ తెచ్చి ఏమ్చేసిందో చూడండి!!

అపట్లో నరకాసురుడి నుంచి కృష్ణుడిని రక్షించేందుకు సత్యభామ యుద్ధం చేసింది. అయితే అది పురాణాలకే పరిమితం అయిపొయింది. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా చాలా ప్రాంతాల్లో వాళ్ళను తక్కువగానే చూస్తున్నారు, ఇది అందరికీ తెలిసిన విషయమే.

అయితే తాజాగా జరిగిన ఒక ఘటన గురించి తెలిస్తే మాత్రం మళ్ళి సత్యభామ పుట్టింది అని అనకుండా ఉండలేరు. అయితే అప్పుడు సత్యభామ విల్లు పట్టింది, ఇప్పుడు సత్యభామ తుపాకీ పట్టింది అంతే తేడా !

కొందరు దుండగుల నుంచి భర్తను కాపాడుకునేందుకు తుపాకీ చేతపట్టింది ఓ మహిళ. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కకోరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అబిద్‌ అలీ అనే జర్నలిస్టుపై సోమవారం ఉదయం ఇద్దరు దుండగులు దాడికి దిగారు.

తన ఇంటి ముందు నిలబడి ఉండగా ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది.అయితే ఇంతలోనే మరో నలుగురు వచ్చి అలీని కొట్టడం ప్రారంభించారు. అందులో ఒకతను అబిద్‌ అలీ ని రాడ్ తో కొట్టడంతో అతను తనను తాను రక్షించుకోలేక పోయాడు. అయితే ఇది గమనించిన అతని భార్య తన ముందే తన భర్తను కొట్టడం తట్టుకోలేక ఇంట్లో నుంచి తుపాకీ తీసుకొచ్చి దుండగులపై గురిపెట్టింది.

తన భర్తను విడిచిపెట్టి వెళ్లాలని బెదిరించింది. వారిని భయపెట్టించేందుకు గాలిలో కాల్పులు కూడా జరిపింది. దీంతో బెదిరిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన అంతా అక్కడి సీసీటీవీల్లో రికార్డు అయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దాడి ఎవరు చేసారు, ఎందుకు చేసారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A man was beaten by a group of unknown people outside his residence in Lucknow’s Kakori area. In a CCTV footage of the incident, the man can be seen being dragged by the miscreants and being beaten with axe, hammer and other objects. While the goons were beating him up, his wife ran out of the house with a gun and fired upon the culprits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X