కొవిడ్-19 వ్యాక్సిన్: మరో గుడ్‌న్యూస్ -94.5శాతం ఎఫెక్టివ్‌గా మోడెర్నా వ్యాక్సిన్ -డిసెంబర్ నుంచే..

కరోనా మహమ్మారి దెబ్బకు 2020 కంటే 2021 ఏడాది ఇంకా భయానకంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అనుబంధ 'వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్' హెచ్చరించిన నేపథ్యంలో మానవాళికి సైన్స్ మరో శుభవార్త అందించింది. కొవిడ్-19 వ్యాక్సిన్ల తయారీ ప్రయోగాల్లో దూసుకుపోతోన్న అమెరికా బయోటెక్ సంస్థల నుంచి వారం వ్యవధిలోనే రెండో ప్రకటన వెలువడింది. ప్రఖ్యాత ఫైజర్ ఫార్మాసూటికల్స్‌ తన జర్మన్ భాగస్వామి బయోఎన్‌టెక్‌తో కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 90 శాతం కన్నా ఎక్కువ ప్రభావం చూపిందని నవంబర్ 9న ప్రకటన చేయగా.. ఇప్పుడు మరో శుభవార్తను అమెరికాకే చెందిన మోడెర్నా బయోటెక్ అందించింది..

వైరస్ పై 94.5 శాతం ప్రభావం..

వైరస్ పై 94.5 శాతం ప్రభావం..


కొవిడ్ 19 వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ఫ్రంట్ రన్నర్లలో ఒకటిగా నిలిచిన మోడెర్నా బయోటింగ్ తన చివరిదశ ప్రయోగాలకు సంబంధించిన వివరాలను సోమవారం వెల్లడించింది. కొవిడ్ 19 ను నివారించడంలో ప్రయోగాత్మక టీకా 94.5% ప్రభావవంతంగా ఉందని ఆ సంస్థ తెలిపింది. అమెరికా వ్యాప్తంగా 30,000 మందికి పైగా వాలంటీర్లు క్లినికల్ ట్రంయల్స్ లో పాలుపంచుకుంటున్నారని, యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ సహకారంతో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నామని మోడెర్నా వెల్లడించింది.

డిసెంబర్ నుంచే వాడకం?

డిసెంబర్ నుంచే వాడకం?

తాము రూపొందించిన వ్యాక్సిన్ 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నదన్న మోడెర్నా సంస్థ.. డిసెంబర్ నెల నుంచే సదరు వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వస్తుందని, ఈ మేరకు అనుమతుల కోసం ప్రభుత్వానికి అప్పీలు కూడా చేస్తామని తెలిపింది. తమ ప్రయోగాలకు సంబంధించిన పూర్తి డేటాను అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పింది. మోడర్నా వ్యాక్సిన్ కూడా ఫైజర్ వ్యాక్సిన్ మాదిరిగానే mRNA సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. మోడర్నా mRNA వ్యాక్సిన్ , mRNA 1273 కొవిడ్ 19కు వ్యతిరేకంగా కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది.

Recommended Video

    COVID-19 Vaccine : కరోనా మహమ్మారిని ఒక టీకా ఏమీ చేయలేదు! - WHO Chief
    సైంటిస్ట్ ఫౌచీ కీలక ప్రకటన..

    సైంటిస్ట్ ఫౌచీ కీలక ప్రకటన..

    ఫార్మా దిగ్గజాలైన ఫైజర్, మోడెర్నా సంస్థలు తమ వ్యాక్సిన్లు 90 శాతానికిపైగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించిన నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖ సైంటిస్ట్, వైరాలజీ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ చివరలో అమెరికాలోని ప్రాధాన్యతా సమూహాలకు ఈ టీకాలను అందించే అవకాశముందని ఫౌచీ చెప్పారు. అటు రష్యాలోనూ గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధ చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ వైరస్ సంక్రమణకు వ్యతిరేకంగా 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నదని రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+