వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేస్తున్న మోడీ, ఈడీ??

|
Google Oneindia TeluguNews

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై ఈడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆ పార్టీని బ‌లోపేతం చేసే దిశగా పడిన మొదటి అడుగు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోనియా విచారణపై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల్లో సానుభూతి వాతావరణం నెలకొంటోందని చెబుతున్నారు. మహిళపై అంత కక్ష సాధింపు ధోరణి దర్యాప్తు సంస్థలకు పనికిరాదని, రాహుల్ ను విచారించిన తర్వాత సోనియాను విచారించడం మతిలేని చర్యగా ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అభివర్ణించారు. మరో నేత జైరాం రమేశ్ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు

లేఖ రాసిన జీ-23 నేతలు

లేఖ రాసిన జీ-23 నేతలు

2014, 2019 ఎన్నిక‌ల‌తోపాటు దేశ‌వ్యాప్తంగా రాష్ట్రాల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ప‌రాజ‌యం పాల‌వుతుండ‌టం, రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంపై జ‌రుగుతున్న ప్ర‌చారం లాంటివ‌న్నీ ప‌రిశీలిస్తున్న సీనియ‌ర్ నేత‌లు అధినాయ‌క‌త్వంపై తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేశారు. గ‌తేడాది జీ-23 పేరుతో 23 మంది అసంతృప్త నేత‌లు సోనియాగాంధీకి లేఖ రాశారు. పార్టీలో సంస్థాగ‌త మార్పులు చేయాల‌ని, స‌మ‌ర్థుల‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు.

ఈ లేఖ‌పై సోనియా, రాహుల్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. మ‌రోసారి ఈ త‌ర‌హా ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మైతే క‌ఠిన చ‌ర్య‌లు తప్పవని హెచ్చ‌రించారు. గులాంన‌బీ ఆజాద్, క‌పిల్ సిబ‌ల్‌, ఆనంద్‌శ‌ర్మ‌, మ‌నీష్ తివారీ, రేణుకాచౌద‌రి, ముకుల్ వాస్నిక్‌, శ‌శిథ‌రూర్ లాంటి నేత‌లంతా ఈ జీ-23లో ఉన్నారు.

సోనియా విచారణపై పెరుగుతున్న సానుభూతి?

సోనియా విచారణపై పెరుగుతున్న సానుభూతి?


ఏడాది కాలంలో ఈ సీనియ‌ర్ నేత‌లంతా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డ‌మే అరుదుగా మారింది. మీడియాతో మాట్లాడ‌టం, కొన్ని కీల‌క‌మైన సంద‌ర్భాల్లో స్పందించ‌డ‌మే జ‌రుగుతోంది. హెరాల్డ్ నిధుల దుర్వినియోగంపై సోనియాను ఈడీ మూడుసార్లు విచారించ‌డంతో ఒక్క‌సారిగా ఆ పార్టీ శ్రేణుల్లో బీజేపీపై వ్య‌తిరేక‌త తీవ్ర‌స్థాయిలో వ్య‌క్త‌మైంది. అంతేకాకుండా సామాన్య ప్ర‌జ‌ల్లో సానుభూతి చేసుకుంటోందని సీనియర్ రాజకీయవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ పరిణామాలతో పార్టీ నేత‌లంతా ఒక్క‌సారిగా మీడియా ముందుకు రావ‌డం ప్రారంభించారు.

మహిళల జోలికి వెళ్లవద్దని చెప్పినా..

మహిళల జోలికి వెళ్లవద్దని చెప్పినా..


త‌మ అధినేత్రిపై జ‌రుగుతున్న ఈడీ ద‌ర్యాప్తు ప‌రంప‌ర‌ను ఆపాల‌ని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న మహిళ సోనియా అని, ఆపాటి చిన్న నియమాన్ని కూడా మరిచిపోయారని ఆజాద్ మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోనియా విషయంలో ఈడీ కఠినంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. వీటిని నియంత్రించే అధికారం ప్రధానమంత్రికి, అమిత్ షాకు, ఇతరులకు ఉన్నప్పటికీ కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతోంది. అయినప్పటికీ మరోసారి సోనియాను విచారించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న తరుణంలో ఇవన్నీ కాంగ్రెస్ ను బలోపేతం చేసే చర్యల్లాంటివేనని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

English summary
Political analysts are of the view that the ED's treatment of Congress president Sonia Gandhi in connection with the National Herald case is the first step towards strengthening the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X