పుల్వామా దాడిపై ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్.. ఆ రోజు ఏం జరిగింది.. ?

ఫిబ్రవరి 14 న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకొంటారు. కానీ భారత్ కు మాత్రం ఇదో చేదు దినంగా మారింది. ఇదే రోజున 2019 లో జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగి నేటికి ఆరేళ్లు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా ఘటనలో మృతి చెందిన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. " 2019 పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు నా నివాళి. భావితరాలు మీ త్యాగాలను మర్చిపోవు. దేశం కోసం మీరు ప్రాణాలు అర్పించారు. మిమ్మల్ని దేశం మరువదు" అని ట్వీట్ చేశారు.

ఉగ్రవాదులను అణచివేస్తాం..

మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు. ఉగ్రవాదులను అణచివేసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. " దేశ ప్రజల తరఫున పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాను. ఉగ్రవాదుల పిరికిపంద చర్య కారణంగా 40 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిజం అనేది మానవాళికి అతిపెద్ద ముప్పు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచం మొత్తం ఏకథాటిపైకి వచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. అణచివస్తాం" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్ అయినా.. ఎయిర్ స్ట్రైక్ అయినా ఏదేమైనా ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Modi and Shah Honor Pulwama Martyrs Vow to Eradicate Terrorism

ఆ రోజు ఏం జరిగింది..?

జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న పాకిస్థాన్ ఉగ్రమూక ఘాతుకానికి ఒడిగట్టింది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జవాన్ల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీర మరణం పొందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్ము- శ్రీనగర్ నేషనల్ హైవేపై పుల్వామా వద్ద సాయంత్రం 4 గంటలకు ఈ దాడి జరిగింది. జమ్ము నుంచి శ్రీనగర్ కు సైనికులు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడి కోసం కశ్మీర్ ఉగ్రవాది ఆదిల్ ను ఉపయోగించుకున్నారు. ఆదిల్ సూసైడ్ బాంబర్ గా మారి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆదిల్ కూడా ఈ దాడిలో హతమయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+