మోడీ కంటతడి: ప్రముఖ్ స్వామి పార్థీవ దేహాన్ని చూసి ఉద్వేగం
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కంటతడి పెట్టారు. గుజరాత్‌లోని సారంగపూర్‌లో స్వామినారాయణ్ ఆధ్యాత్మిక వర్గం సారథి ప్రముఖ్‌స్వామి(95) పార్థివదేహాన్ని సందర్శించిన ఆయన ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు.
చెమర్చిన కళ్లతో స్వామిజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయామని, స్వామిజీ మన మధ్య లేకపోయినా ఆయన బోధనలు చిరకాలం నిలిచిపోతాయని కొనియాడారు.

తన తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయానని మోడీ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా స్వామిజీ పార్థివదేహాన్ని ఆదివారం పలువురు ప్రముఖులు సందర్శించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ స్వామి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆగస్టు 17 వరకు సారంగ్‌పూర్ స్వామినారాయణ్ ఆలయంలో స్వామి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.












Click it and Unblock the Notifications