ప్రోటోకాల్ ను బ్రేక్ చేసిన ప్రధానమంత్రి, నడుచుకొంటూ ఇలా...
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి ప్రోటోకాల్ ను బ్రేక్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా గత ఏడాది తరహలోనే ఈ ఏడాది కూడ మోడీ ప్రోటోకాల్ నుబ్రేక్ చేశాడు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి ప్రోటోకాల్ ను బ్రేక్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలకు నడుచుకొంటూ అబివాదం చేశారు ప్రధానమంత్రి.
గత ఏడాది కూడ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రోటో కాల్ ను బ్రేక్ చేశాడు. గత ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఇదే పద్దతిలో రాజ్ పత్ వద్ద ప్రజలకు అభివాదం చేసుకొంటూ వచ్చారు ప్రధానమంత్రి.

68వ, గణతంత్రి దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం నాడు న్యూఢిల్లీలోని ఎర్రకోటపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా యూఎఇ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హజరయ్యారు. దేశ వ్యాప్తంగా గణతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.












Click it and Unblock the Notifications