మంత్రుల కోసం సమర్థులు లేరా?: మోడీకి పెద్ద సవాల్
న్యూఢిల్లీ: ఇటీవల భారతీయ జనతా పార్టీకి వరుస షాక్‌లు తలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారట. అయితే సమర్థులైన వారు దొరకక ఆయన ఆగిపోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం ప్రధాని మోడీ తన క్యాబినెట్‌లో మార్పులు చేర్పులు చేయనున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. పనితీరు సరిగ్గా లేని మంత్రులను, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి ఇబ్బందులు తెచ్చిన వారిని తొలగించాలని ఆయన భావిస్తున్నారట.
సరైన వ్యక్తులు దొరకడం వల్లనే పునర్ వ్యవస్థీకరణ జరగడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో కొందరు మంత్రుల తొలగింపు ఉండవచ్చని, భారీ స్థాయిలో మార్చేందుకు తగినంత నాణ్యమైన నేతలు లేరని ప్రధాని మోడకి దగ్గరగా మెలిగే బీజేపీ నేతలు చెబుతున్నారట.

పార్టీ భవిష్యత్తుపై ప్రధాని మోడీ ఒత్తిడిలో పడినట్లయిందని, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లయినా ఉద్యోగాల కల్పన, వృద్ధి తదితర అంశాల్లో ముందడుగు పడలేదని, సంస్కరణల అమలు సైతం ఆగిందని ప్రధాని మోడీ అభిప్రాయపడుతున్నట్టుగా చెబుతున్నారు.
సరైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడం ఆయన ముందు పెను సవాలుగా మారిందని అభిప్రాయపడ్డారని అంటున్నారు. వాస్తవానికి అరుణ్ జైట్లీకి రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించాలని ప్రధాని మోడీ భావించినా, ఆర్థిక శాఖను నెరిపేంత సమర్థత మరెవరి వద్దా లేక ఆయన మనోహర్ పారికర్‌ను ఎంచుకున్నారట.


Click it and Unblock the Notifications