మావాడు: గుజరాత్‌లో బిజెపిదే గెలుపు, కారణాలు ఇవే
గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని ఒపినియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ భారీ గెలుపుకు దోహదపడుతుంది.
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని ఒపినియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ భారీ గెలుపుకు దోహదపడుతుంది.
చదవండి: మోడీ హవాతో గుజరాత్ బీజేపీదే: టైమ్స్ నౌ సర్వేలో 118-134 సీట్లు

టైమ్స్ నౌ సర్వేలో ఆసక్తికర విషయాలు
ప్రధాని నరేంద్ర మోడీ పాలన పట్ల ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మోడీ ఫ్యాక్టర్ పని చేస్తుందని భావిస్తున్నారు. టైమ్స్ నౌ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మా వాడు కాబట్టి ఓటు వేస్తాం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ రాష్ట్రానికి చెందిన వారు అని, కాబట్టి ఆయనకు మళ్లీ ఓటు వేస్తామని 81 శాతం మంది ప్రజలు టైమ్స్ నౌ సర్వేలో వెల్లడించారు.

మోడీ వల్ల 20 శాతం ఎక్కువ
2012 కంటే ఇప్పుడు మరింత ఎక్కువ మంది మోడీ ప్రధానిగా ఉంటడం వల్ల బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధాని మోడీ వచ్చాక ప్రాంతీయ పురోగతిని విస్మరించారన్న విపక్షాల విమర్శలకు గుజరాత్ ఎన్నికలు పాఠం కానున్నాయని అంటున్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం
గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం పోల్ స్టంట్ అని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. గుజరాత్‌కు ప్రతీక అని, గుజరాత్ ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకేనని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు.

నోట్ల రద్దుపై అసంతృప్తి
గత ఏడాది ప్రకటించిన నోట్ల రద్దుపై మాత్రం ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా గుజరాత్‌లోని మూడు ప్రాంతాల నుంచి ఆరు వేల మంది నుంచి ఈ సమాచారం సేకరించారు.












Click it and Unblock the Notifications