మోడీ హవాతో గుజరాత్ బీజేపీదే: టైమ్స్ నౌ సర్వేలో 118-134 సీట్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని ఒపినీయన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. బీజేపీకి 115-125 సీట్లు వస్తాయని ఇప్పటికే ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఒపినియన్ పోల్స్ వెల్లడించాయి.

చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే: ఈసీ ప్రకటన

తాజాగా, టైమ్స్ నౌ - విఎంఆర్ ఒపినియన్ పోల్స్ కూడా మోడీ హవా గుజరాత్‌లో బిజెపికి విజయం సాధించి పెడుతుందని తెలిపింది.

టైమ్స్ నౌ - విఎంఆర్ సర్వే ప్రకారం బీజేపీ 118 నుంచి 134 సీట్లు గెలుచుకోనుంది. కాంగ్రెస్ 49 నుంచి 61 సీట్లకు పరిమితం కానుంది. బీజేపీ 150 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అన్ని సీట్లు గెలుచుకోకపోయినప్పటికీ భారీ విజయం మాత్రం ఖాయని ఒపినీయన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి.

Modi wave to sweep Gujarat, predicts Times Now-VMR survey

టైమ్స్ నౌ పోల్ ప్రకారం 50 శాతం మంది బిజెపికి ఓటు వేస్తామని చెప్పగా, 44 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు.

అంతకుముందు మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో లేరు. కాబట్టి బిజెపికి నాలుగు శాతం ఓట్లు తగ్గనున్నాయని సర్వేలో వెల్లడైంది.

గుజరాత్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల వెలుగులోకి వచ్చిన యువ నేతలను, కుల నేతలను దరి చేర్చుకుంటోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఓట్లను, సీట్లను మాత్రం కాంగ్రెస్ పెంచుకోనుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Times Now-VMR survey of voters in Gujarat has predicted a comfortable victory for the BJP in the state. The Times Now-VMR opinion survey projects that the BJP could secure around 118-134 seats in the Gujarat assembly elections. The Congress could secure around 49-61 seats. While this means that the BJP does have enough numbers, it might not reach the desired number of 150.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి