మోడీ ఫారిన్ టూర్స్: 36పర్యటనలకు రూ.239కోట్లకు పైగా ఖర్చు.. సాధించింది ఏంటంటే!!
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల కోసం ఐదేళ్ల కాలంలో 239 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు రాజ్యసభలో కేంద్రమంత్రి మురళీధరన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాజ్యసభలో ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం, గత ఐదు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం 36 దేశాలకు పర్యటించినట్టు, దీనికోసం మొత్తం 239 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయినట్టు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ప్రధాని పర్యటనలు, పర్యటన యొక్క ఫలితాలు, ఒక్కో పర్యటనకు చేసిన ఖర్చుల వివరాలపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి మురళీధరన్ సమాధానమిచ్చారు.

మోడీ ఫారిన్ టూర్స్ .. వివరాలు, ఖర్చుల లెక్కలు చెప్పిన మంత్రి మురళీధరన్
విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపై మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఆయన పర్యటనకు సంబంధించిన లెక్కలు చెప్పారు. మురళీధరన్ తన లిఖితపూర్వక సమాధానంలో, నవంబర్ 2017లో తన తొలుత ఫిలిప్పీన్స్ పర్యటనను ప్రారంభించినట్టు పేర్కొని ప్రతీ పర్యటనకు ఆయన లెక్కలను, వివరాలను వెల్లడించారు. మొత్తం ప్రధాని మోడీ చేసిన 36 పర్యటనలలో, తొమ్మిది పర్యటనలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో మోడీ పర్యటన సాగినట్లు తెలిపారు. అంతేకాదు 36 పర్యటనలలో ప్రధానమంత్రితో పాటు పర్యటనలలో పాల్గొన్న ప్రతినిధులు బృందాల వివరాలను కూడా వెల్లడించారు.

మోడీ పర్యటనల ఖర్చులో గరిష్టం అమెరికా పర్యటనకే
మొత్తం ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చు కోసం 31 పర్యటనలకు సంబంధించి బడ్జెట్ నుంచి ఖర్చు చేసినట్లుగా కేంద్రం వెల్లడించింది. 2017 లో మొదట ఫిలిప్పీన్స్ లో, 2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఇలా మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు చేసిన పర్యటనల ఖర్చు రూ.239,04,08,625 అయినట్టుగా కేంద్రమంత్రి మురళీధరన్ లెక్కలు చెప్పారు. వీటిలో అత్యధికంగా ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 21 నుండి 28, 2019లో అమెరికా పర్యటన కోసం 23 కోట్ల 27 లక్షల 9 వేల రూపాయలు ఖర్చు అయినట్టు తెలిపారు. సెప్టెంబర్ 26 నుండి 28 వరకు ఈ ఏడాది జపాన్ పర్యటనకు రూ. 23 లక్షల 86 వేల 536 రూపాయలు ఖర్చు చేయబడిందని కేంద్ర మంత్రి తెలిపారు.

మోడీ విదేశీ పర్యటనల వల్ల దేశానికి కలిగిన లాభమిదే
ఈ పర్యటనలు భారత దేశానికి ఎంతో లబ్ధి చేకూర్చాయని, విదేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయని మురళీధరన్ వ్యాఖ్యానించారు. అత్యున్నత స్థాయిలో విదేశీ భాగస్వాముల మధ్య ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాలపై అవగాహనను పెంచడానికి మోడీ విదేశీ పర్యటనలు ఉపయోగ పడ్డాయి అన్నారు.

ఇలాంటి పర్యటనలే జాతీయ ప్రయోజనాలు పొందటానికి సాధనం
భారతదేశం తన విదేశాంగ విధానం లక్ష్యాలను, జాతీయ ప్రయోజనాలను పొందడం కోసం ఇటువంటి పర్యటనలే ఒక ముఖ్యమైన సాధనం అని మంత్రి మురళీధరన్ వెల్లడించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సమయంలో కుదిరిన అవగాహన భారతదేశానికి భాగస్వామ్య దేశాలతో సంబంధాలు బలోపేతం కావడానికి ఉపయోగ పడ్డాయి అన్నారు. భారతదేశ దృక్కోణాన్ని ప్రపంచదేశాలకు తెలియజేసి అంతర్జాతీయ నేరాలు, ఉగ్రవాదం, సైబర్ భద్రత మొదలైన ప్రపంచ సమస్యలపై ప్రపంచ అజెండాను రూపొందించడానికి వీలు కల్పించాయని పేర్కొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications