పెద్ద నోట్ల రద్దు: మోడీ సతీమణి జశోదాబెన్ ఏం చెప్పారంటే..?
పెద్ద నోట్ల రద్దు: మోడీ సతీమణి జశోదాబెన్ ఏం చెప్పారంటే..?
జైపూర్: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆయన సతీమణి జశోదా బెన్ మోడీ మద్దతు పలికారు. కోటాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జశోదాబెన్ మాట్లాడారు.

దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇలాగే కొనసాగించాలని అభిలాషించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలిస్తుందని, చెప్పారు.
అంతేగాక, విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తుందని జశోదాబెన్ వ్యాఖ్యానించారు. మోడీ నేతృత్వంలోని కేంద్రం పనితీరుపై స్పందించాలని మీడియా కోరగా.. సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్రం తన కృషిని కొనసాగించాలని కోరుకుంటున్నట్ల తెలిపారు.












Click it and Unblock the Notifications