బీజేపీ పంజాబ్ ఎత్తులు-రేపటి నుంచి కర్తార్ పూర్ కారిడార్ ఓపెన్-అమరీందర్, సిద్ధూ థ్యాంక్స్

పంజాబ్ లో మరో మూడు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అసలే రైతుల సెగ, మరోవైపు ఆప్ దూకుడు, అధికార కాంగ్రెస్ తో తలపడాల్సిన పరిస్ధితుల్లో కొత్త ఎత్లులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19న గురునానక్ జయంతి సందర్భంగా సిక్కులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.

గురునానక్ జయంతిని పురస్కరించుకుని, ఈ సిక్కు గురువుపై ఉన్న గౌరవంతో ఆయన జయంతి సందర్భంగా కర్తార్ పూర్ కారిడార్ ను తిరిగి తెరవాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారీ సంఖ్యలో ఉన్న సిక్కు భక్తుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గురునానక్ తో పాటు సిక్కు వర్గాలపై ఉన్న గౌరవంతోనే కర్తార్ పూర్ కారిడార్ పునఃప్రారంభించాలని నిర్ణియించినట్లు తెలిపారు.

modi government to reopen kartarpur corridor from tomorrow, amarinder singh hails the decision

గురునానక్ జయంతి దృష్ట్యా కర్తార్ పూర్ కారిడార్ తెరవాలని కేంద్రం తీసుకన్న నిర్ణయంపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ కూడా స్పందించారు. వీరిద్దరూ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. నానక్ జయంతి అయిన గురుపూరబ్ సందర్భంగా కర్తార్ పూర్ కారిడార్ తెరవడం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమని వీరు ప్రశంసించారు. దీనిపై వీరిద్దరూ వేర్వేరు ట్వీట్లు చేశారు.

గురునానక్ జయంతి సందర్భంగా కర్తార్ పూర్ కారిడార్ ద్వారా గురుగ్రంధ్ సాహిబ్ కు వెళ్లాలనుకునే సిక్కు భక్తులు.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని బీజేపీ నేత హర్జీత్ సింగ్ గ్రేవాల్ కోరారు. ఎల్లుండి నుంచి కారిడార్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. రెండు రోజుల క్రితం పంజాబ్ బీజేపీ నేతల బృందం ప్రధాని మోడీని కలిసి కర్తార్ పూర్ కారిడార్ ను మరోసారి తెరవాలని కోరారు. దీంతో వారి విజ్ఞప్తిని మన్నించిన కేంద్రం.. పాకిస్తాన్ కు వెళ్లే ఈ కారిడార్ ను తిరిగి తెరిచేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+