అఫ్గాన్ గురించి మోదీకి ఏమీ తెలీదా? -తాలిబన్ పాలనపై ఇండియా స్టాండ్! -26న అఖిలపక్ష భేటీ
ఇండియాతో సరిహద్దులు పంచుకునే అఫ్గానిస్థాన్ ఇప్పుడు మళ్లీ తాలిబన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అమెరికా సేనల నిష్క్రమణ, అధ్యక్షుడు అష్రఫ్ ఘని పరారీతో కాబూల్ సహా దేశంలో మెజార్టీ ప్రాంతాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు షరియత్ చట్టాల ప్రకారం ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటించారు. మహిళలు, సొంత పౌరులపై హింసకుతోడు, అత్యంత ప్రమాదకరమైన ఐసిస్, అల్ కాయిదా, లష్కరే, జైషే లాంటి ఉగ్రవాద సంస్థలకూ తాలిబన్లు బాసటగా నిలుస్తుండటం, ఆయా సంస్థలు తమ కేంద్ర కార్యాలయాలను అఫ్గాన్ భూభాగంలోకి తరలించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. పాకిస్తాన్, చైనా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు తాలిబన్ ప్రభుత్వానికి మద్దతు పలికిన దరిమిలా ఇండియా స్టాండ్ ఏమిటన్నది కీలకంగా మారింది..

తాలిబన్లతో భారత్ చర్చలు?
తుపాకి ద్వారా సాధించుకున్న తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించబోమని భారత సర్కారు ఇదివరకే స్పష్టం చేసినప్పటికీ, గడిచిన పది రోజుల్లో అఫ్గానిస్థాన్ పై అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారిపోవడం, అమెరికా తప్ప మెజార్టీ దేశాలు తాలిబన్ సర్కారుకు అవకాశమివ్వాలనే వాదన వైపు మొగ్గు చూపుతోన్న దరిమిలా ఇండియా వ్యవహారశైలి ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్, చైనాతో కలిసి తాలిబన్లు ఇండియాపై దాడులకు తెగబడటానికి ముందే వాళ్లతో మోదీ సర్కారు చర్చలు జరపాలని రక్షణ వ్యవహారాల నిపుణులు అంటోంటే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీలాంటి నేతలు బాహాటంగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అఫ్గాన్ వ్యవహారాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఆదేశాలిచ్చారు..

విదేశాంగ శాఖకు మోదీ ఆదేశం
అఫ్గానిస్థాన్ లో జరుగుతోన్న పరిణాలను పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు వివరించాలని విదేశాంగ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సోమవారంనాడు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన తక్కిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేస్తారని ఆయన చెప్పారు. కాబూల్ తాలిబాన్ గుప్పిట్లోకి వెళ్లిన నేపథ్యంలో అక్కడి భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకువస్తున్న నేపథ్యంలో మోదీ ఈ తాజా ఆదేశాలిచ్చారు. అఫ్గాన్ లో చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు ప్రతి రోజూ కాబూల్ నుంచి రెండు విమానాలను నడుపుతుండగా, అఫ్గాన్ లో ఉన్న హిందువులు, సిక్కులతో పాటు స్థానికులకు కూడా సహాయం చేయనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. దీనికి..

అఫ్గాన్‌పై 26న ఆల్ పార్టీ మీటింగ్
పొరుగున ఉన్న అఫ్గానిస్థాన్‌లోని తాజా పరిస్థితులపై అన్ని రాజకీయ పార్టీలకు బ్రీఫింగ్ ఇవ్వాలని విదేశాంగ మంత్రి జైశకర్ ను ప్రధాని మోదీ ఆదేశించిన దరిమిలా, అందుకోసం అఫ్గాన్ అంశాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ నెల 26న(గురువారం) అఫ్గాన్ వ్యవహారాలపై ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుందని, ఈ మేరకు ఫ్లోర్ లీడర్లకు సందేశాలు పంపుతామని మంత్రి చెప్పారు. ఆ భేటీలో తాలిబన్ల పట్ల భారత్ అనుసరించాల్సిన వైఖరి గురించి చర్చచర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ నుంచి అన్ని దేశాలు తమ సిబ్బంది, పౌరుల్ని తరలిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ కూడా ఆ దేశం నుంచి విమానాలు నడుపుతోంది. ఆగస్టు 16న ప్రారంభమైన తరలింపు ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత వాయుసేన, ఎయిర్ ఇండియా కలిసి ఈ మిషన్‌లో పాల్గొంటున్నాయి.

తాలిబన్లపై భారత్ వ్యూహమేంటి?
అఫ్గాన్ లో గంట గంటకూ పరిస్థితులు మారుతోన్న క్రమంలో, ఒక దశలో తాలిబన్లు భారతీయుల్ని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత అదేం లేదని, కేవలం పత్రాల తనిఖీ కోసమే వారిని తాలిబన్లు ప్రశ్నించినట్లు తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ తరహా పరిణామాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈనెల 17న మోదీ అధ్యక్షతన జాతీయ భద్రతపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలోనూ అఫ్గాన్ అంశాన్నే ప్రధానంగా చర్చించిన సంగతి తెలిసిందే. అమెరికా, నాటో దళాలు ఆగస్టు 31 తర్వాత అఫ్గాన్ గడ్డపై కనిపిస్తే ఊరుకోబోమని తాలిబన్లు కఠినంగా హెచ్చరించిన నేపథ్యంలో అక్కడున్న భారతీయులు అందరినీ త్వరితగతిన తరలించాలని కేంద్రం భావిస్తున్నది. ప్రస్తుతానికి తాలిబన్లను గుర్తించబోమంటోన్న మోదీ సర్కారు.. అఖిలపక్షం భేటీ తర్వాత స్టాండ్ మార్చుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే,
Recommended Video

అఫ్గాన్ తాలిబన్‌పై మోదీకి ఏమీ తెలీదా?
దక్షిణాసియాతోపాటు యావత్ ప్రపంచ రాజకీయాలనూ ప్రభావితం చేయగలిన అఫ్గానిస్థాన్, తాలిబన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. అఫ్గాన్ పరిణామాలపై పార్టీల ఫ్లోర్ లీడర్లకు వివరించాలని మోదీ చేసిన దిశానిర్దేశంపై రాహుల్ ఘాటుగా స్పందించారు. ''అఫ్గాన్ లో జరుగుతోన్న పరిణామాలను స్వయంగా ప్రధాని మోదీనే ప్రతిపక్ష నేతలకు ఎందుకు వివరించలేరు? అఫ్గాన్ లో జరుగుతున్న పరిణామాలపై మోదీకి ఏమాత్రం అవగాహన లేదా?'' అని రాహుల్ ఎద్దేవా చేశారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications