వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ ధరలను తగ్గించండి ప్లీజ్ -సీరం, భారత్ బయోటెక్‌కు మోదీ సర్కార్ విన్నపం -మాట వింటారా?

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతూ, రోజువారీ కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతోన్న క్రమంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో వైరస్ కట్టడిలో కీలకంగా భావిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియనూ కేంద్రం వేగవంతం చేసింది. కానీ టీకా తయారీదారులైన ఫార్మా సంస్థలు మాత్రం అసాధారణ ధరలు ప్రకటించి అందరికీ షాకిచ్చాయి. సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించిన వ్యాక్సిన్ ధరలపై తీవ్రస్థాయి విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ధరల తగ్గింపు దిశగా కేంద్రంలోని మోదీ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది...

జస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలుజస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలు

జగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబుజగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబు

 ధరలు తగ్గించండి..

ధరలు తగ్గించండి..

మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మే 1 నుంచి 18 ఏండ్లు పైబ‌డిన అందరికీ టీకాలు వేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న క్ర‌మంలో కొవిడ్-19 వ్యాక్సిన్లు కొవిషీల్డ్, కొవాగ్జిన్ ధ‌ర‌ల‌ను తగ్గించాల‌ని త‌యారీ సంస్ధ‌లు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), భార‌త్ బ‌యోటెక్ ల‌ను కేంద్ర ప్రభుత్వం కోరిందని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన సోమవారం జరిగిన కీలక సమావేశంలోనూ వ్యాక్సిన్ ధరల అంశం ప్రస్తావనకు వచ్చిందని, అధిక ధరలపై పలు రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయని, ఈ నేపథ్యంలోనే కేంద్రం స్పందించిందని వెల్లడైంది.

విలయంలో వ్యాపారమా?

విలయంలో వ్యాపారమా?

కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాలూ వ్యాక్సిన్ ధ‌ర‌ల్లో అస‌మాన‌త‌ల‌పై కేంద్రాన్ని, టీకాల తయారీదారులైన సీరం, భారత్ బయోటెక్ సంస్థలనూ నిలదీస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేట్ ద‌వాఖానాల‌కు వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాలో ధ‌ర‌ల వ్య‌త్యాసంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. విలయకాలంలో వ్యాపారమే ముఖ్యమా అంటూ కొందరు నేతలు బాహాటంగా ఆరోపణలు చేశారు. ధ‌ర‌ల వ్య‌త్యాసం ప‌ట్ల రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు వివిధ వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో వ్యాక్సిన్ ధ‌ర‌లను తగ్గించాల‌ని దేశీ వ్యాక్సిన్ త‌యారీ సంస్ధ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కోరింది.

Recommended Video

MLA Jagga Reddy Helping Corona Patients ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేస్తే తగిన సహాయం చేస్తా
 సీరం, భారత్ బయో అంగీకరిస్తాయా?

సీరం, భారత్ బయో అంగీకరిస్తాయా?

వ్యాక్సిన్లకు సంబందించి తాము ప్రకటించిన ధరలు అధికంగా ఏమీ లేదని, భారత్ లో తయారైన వాటిని ప్రపంచ దేశాల ధరలతో పోల్చడం సరికాదని కొవిషీల్డ్ తయారీదారు సీరం, కొవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటెక్ తమ చర్యను సమర్థించుకున్నాయి. ప్ర‌స్తుతం భార‌త్ బ‌యోటెక్ కొవాగ్జిన్ ను రా|ష్ట్రాల‌కు డోస్ కు రూ 600 చొప్పున‌, ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు రూ 1200కు స‌ర‌ఫ‌రా చేస్తుండ‌గా కేంద్ర ప్ర‌భుత్వానికి వ్యాక్సిన్ డోస్ ను రూ 150 కే స‌ర‌ఫ‌రా చేస్తోంది. ఇక సీరం కొవిషీల్డ్ ధ‌ర‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు ఒక్కో డోస్ కు రూ 400గా నిర్ణ‌యించ‌గా ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు రూ 600కు స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ధరల తగ్గించాలన్న కేంద్ర ప్ర‌భుత్వ అభ్య‌ర్ధ‌నపై సీరం, భార‌త్ బ‌యోటెక్ ల స్పంద‌న ఎలా ఉంటుంద‌నేది వేచిచూడాలి.

English summary
The central government has asked the Serum Institute of India and the Bharat Biotech to explore possibilities of reducing prices of their Covid-19 vaccines, according to national media reports. This comes ahead of May 1 when India's Covid-19 vaccination drive would be further opened up allowing all adults above the age of 18 years to get vaccinated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X