వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రభుత్వ కొత్త పథకం: టీడీ డిపాజిట్ స్కీం-ఐదేళ్లలో ఒక లక్షపై రూ. 39వేల వడ్డీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 చివరలో ఒక కొత్త పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్(టీడీ) స్కీం 2019 పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఖాతాలో పొదుపు చేయాలనుకునేవారు రూ. 1000కి తక్కువ కాకుండా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు.

నాలుగు రకాలుగా..

నాలుగు రకాలుగా..

ఈ స్కీంలో నాలుగు రకాలుగా టైం డిపాజిట్‌లు చేసుకోవచ్చు. టైమ్ డిపాజిట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో ఒక సంవత్సరం ఖాతా లేదా రెండు, మూడు, ఐదు సంవత్సరాల ఖాతాలున్నాయి. ఈ ఖాతాల్లో డిపాజిట్లను ఒక సంవత్సరం, రెండు, మూడు, నాలుగు సంవత్సరాల్లో డిపాజిట్ చేయవచ్చు.

రూ. 1000 నుంచి..

రూ. 1000 నుంచి..

ఈ టైం డిపాజిట్ ఖాతాలను ఒక వ్యక్తి, ముగ్గురు కలిసి సంయుక్త పేర్లపై, పదేళ్లలోపు మైనర్, మైనర్ తరపు సంరక్షకుడు కానీ తెరవచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ టీడీ ఖాతాలను కలిగివుండవచ్చు. లేదా సంయుక్త ఖాతాలను కూడా కలిగిఉండవచ్చు.

టైమ్ డిపాజిట్(టీడీ) ఖాతాలో కనీసం రూ. 1000 నుంచి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట డిపాజిట్‌పై పరిమితి లేదు. రూ. 100 మల్టిపుల్ చేసే మొత్తాలను జమ చేయవచ్చు.

టైమ్ డిపాజిట్ ఖాతాలపై వచ్చే వడ్డీ ఇలావుంది..

టైమ్ డిపాజిట్ ఖాతాలపై వచ్చే వడ్డీ ఇలావుంది..

మొదటి సంవత్సరం - 6.9శాతం

రెండో సంవత్సరం - 6.9 శాతం
మూడో సంవత్సరం - 6.9శాతం
ఐదవ సంవత్సరం - 7.7శాతం
కీలక నియమాలు:
ఖాతా తెరిచిన సమయం(సంవత్సరం) నుంచి ఈ నాలుగు ఖాతాల మొత్తాలపై త్రైమాసికానికి ఒకసారి వడ్డీని చెల్లించడం జరుగుతుంది. ఈ వడ్డీ మొత్తం ఖాతాదారుల పొదుపు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. వడ్డీ మొత్తాన్ని ఖాతాదారులు ఉపసంహరణ చేసుకోనప్పటికీ ఆ మొత్తంపై మాత్రం అదనపు వడ్డీ చెల్లించడం జరగదు.

టైమ్ డిపాజిట్ స్కీం:

టైమ్ డిపాజిట్ స్కీం:

మొదటి సంవత్సరం వడ్డీ 6.90శాతం ఏడాదికి వడ్డీ మొత్తం రూ. 7081

రెండో సంవత్సరం వడ్డీ 6.90శాతం ఏడాదికి వడ్డీ మొత్తం రూ. 7081
మూడో సంవత్సరం వడ్డీ 6.91 శాతం ఏడాదికి వడ్డీ మొత్తం రూ. 7081
ఐదో సంవత్సరం వడ్డీ 7.70శాతం ఏడాదికి వడ్డీ మొత్తం రూ. 7925
ఐదేళ్లలో రూ. లక్ష డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ రూ. 7925x5= 39,625 పొందవచ్చు. ప్రతీ ఏడాది వచ్చిన వడ్డీని విత్ డ్రా చేసుకుని మరో పథకంలో పెట్టుబడిగా పెట్టుకోవచ్చు.
ప్రీమెచూర్ విత్ డ్రావల్(ముందగా ఉపసంహరణ): ఒకవేళ ఐదేళ్ల టైమ్ డిపాజిట్ నాలుగేళ్లకే మూసివేస్తే.. మూడేళ్లకు సంబంధించిన వడ్డీ మాత్రం అందుతుంది. ముందే దీనికి సంబంధించిన వడ్డీని చెల్లిస్తే ఆ మొత్తం నుంచి తిరిగి తీసుకోబడుతుంది.
టీడీ ఖాతాను బదిలీ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఫాం-5 ద్వారా అంగీకార పత్రంతో ఖాతాను బదిలీ చేసుకోవచ్చు.

English summary
Modi govt new Time Deposit Scheme 2019: Earn Rs 39,625 interest on Rs 1 lakh in 5yrs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X