• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ సర్కార్ మరో సంచలనం -హైదరాబాద్ సహా మిగిలిన ఎయిర్ పోర్టులన్నీ పూర్తిగా ప్రైవేటు చేతికి

|

నాలుగైదు వ్యూహాత్మక రంగాలు తప్ప, దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని ప్రకటించిన మోదీ సర్కార్.. ఆ ప్రక్రియను మరింత వేగంగా ముదుకు తీసుకెళుతోంది. ఏశాఖలో ఏమేరకు ఆస్తులు అమ్మాలనే వివరాలు సిద్ధంకాగా, ఆమేరకు నీతి ఆయోగ్ టార్గెట్లను కూడా నిర్ధారించింది. రైల్వే శాఖకు అత్యధికంగా రూ.90వేల కోట్ల టార్గెట్ విధించగా, టెలికాం శాఖలో రూ.40వేల కోట్ల ఆస్తుల్ని విక్రయించనున్నారు. అదే క్రమంలో రోడ్లు, హైవేల శాఖకు రూ.30 వేల కోట్లు, విద్యుత్ శాఖకు రూ.27వేల కోట్లు, విమానయానంలో రూ.20వేల కోట్లు, క్రీడా శాఖలో రూ.20 వేల కోట్లు, పెట్రోలియం 17వేల కోట్లు, పోర్టులు షిప్పింగ్ శాఖకు రూ.4వేల కోట్ల టార్గెట్ విధించారు. కాగా, ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణకు సంబంధించి..

  #AirportsPrivatisation : హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోని వాటాల విక్రయం!!

  టీడీపీ ఓటమిపై చంద్రబాబు స్పందన -సిగ్గుంటూ మళ్లీ క‌ృష్ణాజిల్లాకు రావొద్దన్న మంత్రి కొడాలి నానిటీడీపీ ఓటమిపై చంద్రబాబు స్పందన -సిగ్గుంటూ మళ్లీ క‌ృష్ణాజిల్లాకు రావొద్దన్న మంత్రి కొడాలి నాని

  ఎయిర్ పోర్టుల్లో వాటాల విక్రయం..

  ఎయిర్ పోర్టుల్లో వాటాల విక్రయం..

  ఇప్పటికే ఎయిర్ ఎండియా, బీఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తోపాటు మరెన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వాటాలు కలిగిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడంతోపాటు ఇప్పటికే ఆయా సంస్థల్లో ప్రభుత్వానికి ఉన్న వాటాలను విక్రయించడం ద్వారా మొత్తం రూ. 2.5 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్ పోర్టుల్లో వాటాల విక్రయానికి రంగం సిద్ధమైందని ఆదివారం రిపోర్టులు వెలువడ్డాయి. ప్రధానంగా..

  హైదరాబాద్ సహా ఈ ఎయిర్ పోర్టుల్లో..

  హైదరాబాద్ సహా ఈ ఎయిర్ పోర్టుల్లో..

  విమానాశ్రయాల అమ్మకం విషయంలో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు లాభాల్లో ఉన్న, అంతగా లాభాల్లో లేని విమానాశ్రయాలను కలిపి విక్రయించనున్నారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏఏఐ దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. కాగా, ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్‌నకు 74 శాతం వాటా ఉంది. మిగతా 26 శాతం వాటా ఏఏఐ సొంతం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపునకు 54 శాతం వాటా ఉండగా, ఏఏఐకి 26 శాతం, ఫ్రాపోర్ట్ ఏజీ అండ్ ఎరామన్ మలేసియాకు 10 శాతం వాటా ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విషయానికి వస్తే ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉండగా, బెంగళూరులోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. వీటన్నింటిలో కేంద్రం తన వాటాలను అమ్మేయనుంది. తద్వారా ఈ ఎయిర్ పోర్టులు పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి..

  తొలి దశలో అదానీకి ఫాయిదా..

  తొలి దశలో అదానీకి ఫాయిదా..

  పౌర విమానయానంలో ప్రైవేటీకరణకు సంబంధించి తొలి దశలో లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల కాంట్రాక్ట్‌లను అదానీ గ్రూప్ ఇప్పటికే దక్కించుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం గుర్తించగా అందులో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోని ఏఏఐ వాటాలను అమ్మేయాలని నిర్ణయించినట్టు సంబంధిత శాఖకు చెందిన కీలక వ్యక్తులు వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. గత నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్స్‌లోని వంద ఆస్తులను నగదుగా మార్చుకుంటామని పేర్కొన్నారు. ఈ మొత్తం విలువ రూ. 2.5 లక్షల కోట్లని పేర్కొన్నారు. ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తుల విక్రయం ద్వారా మొత్తం 1.75 లక్షల కోట్ల సమీకరించాలని నిర్ణయించింది.

  English summary
  union government plans to sell its residual stake in already privatised Delhi, Mumbai, Bengaluru and Hyderabad airports as part of privatisation, says report.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X