వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిషా సాక్షిగా: మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పకనే చెప్పిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

ఒడిషా: 2019లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న ఒడిషా ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. ఒడిషాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రధాని మోడీ. బొగ్గు గ్యాస్ ఆధారిత ఫర్టిలైజర్ ప్లాంట్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఫర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం 2000లో తీసుకోవడం జరిగిందని ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు.

మూడేళ్ల తర్వాత మళ్లీ ప్లాంట్ ప్రారంబోత్సవానికి వస్తా

మూడేళ్ల తర్వాత మళ్లీ ప్లాంట్ ప్రారంబోత్సవానికి వస్తా

ప్లాంట్ పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుందని తాను అధికారులను అడిగితే మూడేళ్ల సమయం పడుతుందని సమాధానం ఇచ్చారని..తిరిగి ప్లాంట్ ప్రారంభోత్సవానికి తను మూడేళ్ల తర్వాత వస్తానని మోడీ సభలో తెలిపారు. తాల్చర్ ఫెర్టిలైజన్స్ లిమిటెడ్, గెయిల్, కోల్ ఇండియా లిమిటెడ్, కెమికల్స్ అండ్ ఫర్టిలెజర్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. 2022 కల్లా పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో ఒడిషాలో యూరియా కొరత ఉండదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఒడిషా రాష్ట్రంలో యూరియా ఉత్పత్తి కేంద్రం లేదు.

ఆయుష్మాన్ భారత్ పథకం నుంచి నవీన్ తప్పుకున్నారు

ఆయుష్మాన్ భారత్ పథకం నుంచి నవీన్ తప్పుకున్నారు

కమీషన్ల కోసం పనిచేయడం, సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవడంతోనే ఇలాంటి ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని మోడీ మండిపడ్డారు. అంతేకాదు ఆయుష్మాన్ భారత్ పథకం నుంచి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తప్పుకోవడాన్ని తప్పుబట్టారు ప్రధాని. ప్రజల ఆరోగ్యం కోసం కేంద్రం మంచి పథకాన్ని ప్రారంభిస్తుంటే... అందుకు నవీన్ పట్నాయక్ సహకరించడం లేదని మోడీ ఆరోపించారు. ఇలా అయితే తాను నిస్సహాయ స్థితిలో ఉండటం తప్ప ఏమీ చేయలేనని మోడీ ప్రజలకు వివరించారు. సెప్టెంబర్ 23న జార్ఖండ్‌లో ప్రారంభం కానున్న ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం ద్వారా 10 కోట్ల కుటుంబాలు అంటే 50 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారని ప్రధాని తెలిపారు.

పారిశుద్ధ్యంలో ఒడిషా వెనకబడి ఉంది

పారిశుద్ధ్యంలో ఒడిషా వెనకబడి ఉంది


పారిశుద్ధ్యం వైపు ఒడిషా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్న ప్రధాని.. పారిశుద్ధ్యం విషయంలో ఇతర రాష్ట్రాలతో పోటీపడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పారిశుద్ధ్యంపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌ను హెచ్చరించినట్లు ప్రధాన తెలిపారు. పారిశుద్ధ్య విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఒడిషా వెనకబడి ఉందని తాను చెప్పినట్లు ప్రధాని స్పష్టం చేశారు. ప్రజలను అనారోగ్యపాలు చేయొద్దని తాను సీఎంకు చెప్పినట్లు ప్రధాని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒడిషా రాష్ట్రానికి కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యాయని చెప్పిన ప్రధాని మోడీ... ఇందుకోసం కేంద్రం రూ.570 కోట్లు నిధులు ఇస్తోందన్నారు.

English summary
Prime Minister Narendra Modi took on Odisha chief minister Naveen Patnaik at massive public meetings on his own turn as he launched a half-a-dozen projects, including a fertilizer plant in Talcher and Jharsuguda Airport. After laying the foundation stone for the country’s first coal gasification based fertiliser plant, PM Modi said the decision to start the unit was taken in 2000 but the plan remained on paper only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X