'నరేంద్ర మోడీ యాక్షన్ పీఎం కాదు ఆక్షన్ పీఎం'

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ప్రధాని నరేంద్రమోడీపై ధ్వజమెత్తారు. మోడీ యాక్షన్ పీఎం కాదని, ఆక్షన్ పీఎం అంటూ విమర్శించారు.

"ఆయన బొగ్గు గనులను, స్పెక్ట్రమ్‌ను వేలం వేశారు. ఇప్పుడు బీహార్‌ను వేలానికి పెట్టి, రాష్ట్రంతో తమాషా చేశారు. ఎంత ప్యాకేజీ కావాలి? అని సభకు హాజరైన ప్రజలను అడగడం వారి ఆత్మగౌరవంతో ఆడుకోవడమే. తమ ఆత్మాభిమానం పరిహాసానికి గురికావడాన్ని బీహార్ ప్రజలు సహించరు" అని పేర్కొన్నారు.

Modi is not an action PM, but an auction PM, says Jairam Ramesh

ఈ ఏడాది చివరలో బీహార్‌కి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇటీవలే పాట్నాలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభలో మోడీ బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.

దీంతో, బీహార్‌లోని జేడీ(యూ), ఆర్జేడీ వంటి పార్టీలకే కాకుండా, కాంగ్రెస్‌కు కూడా అవాక్కయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ ప్యాకేజీ ప్రకటించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఎన్డీఏ ఏడాది పాలనలో బీహార్‌ను విస్మరించిన మోడీ ఎన్నికల ముందు ప్యాకేజీ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేయడానికే ఈ ప్యాకేజీ ఎరగా వేశారని పాట్నాలోని వైశ్య ప్రతినిధి సమ్మేళనంలో పాల్గొన్న సందర్భంగా లాలూ పేర్కొన్నారు.

ఈ ప్యాకేజీతో మోడీ అందరినీ పూల్స్‌ను చేశారని మండిపడ్డారు. ఆయన దేవుడిని కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీ(యూ)-కాంగ్రెస్ కూటమి చేతిలో బీజేపీకి పరాభవం తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+