Modi: మేము ఏం చేశాము, మేడమ్ పార్టీ ఏం చేసింది ?, మీరే చెప్పండి, ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్, డిటైల్ గా !

కర్ణాటకలో మొట్టమొదటి ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డును కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మించిందని నరేంద్ర మోదీ అన్నారు.

బెంగళూరు/మండ్య: ప్రధాని నరేంద్ర మోదీ కన్నడిగులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవే రహదారిని ప్రారంభించిన ప్రధాని మోదీ కన్నడలో మాట్లాడుతూ తన ప్రసంగంతో కన్నడిగులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. కర్ణాటకలో మొట్టమొదటి ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డును కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మించిందని నరేంద్ర మోదీ అన్నారు. మైసూరు మహరాజు కృష్ణరాజ వడయార్, సర్ ఎం విశ్వేశ్వరయ్య వలనే ఈ ప్రాంత్రం ఇంత అభివృద్ది చెందుతోందని, వీరిద్దరూ గతంలో కలలు కన్నారని, ఇప్పుడు వారి కలలు నేరవేరాయని, ఈ నేలను అభివృద్ది చెయ్యాలని అనేక ప్రయత్నాలు ఇద్దరూ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంకా ప్రధాని మోదీ ఏమని చెప్పారంటే ?

జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో నిర్మించిన మైసూర్-బెంగళూరు మధ్య 118 కిలోమీటర్ల మేర రాష్ట్రంలోని తొలి ఎక్స్‌ప్రెస్‌వేని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది యాక్సెస్ నియంత్రిత హైవే, రెండు వైపులా సర్వీస్ రోడ్డు రెండు లేన్లు ఉన్నాయి. మొత్తం 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే. ఆదివారం మండ్య జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ బెంగళూరు- మైసూరు ఎక్స్ ప్రెస్ హైవే రహదారిని జాతికి అంకితం చేశారు.

ప్రధాని మోదీ ఏం చెప్పారంటే ?

మండ్య జిల్లాలోని గెజ్జలగెరెలో నిర్మించిన భారీ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కన్నడలో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆది చుంచనగిరి, మేలుకోటేలోని గురువులకు నివాళులర్పించి తన ప్రసంగం ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మైసూర్ నుంచి బెంగళూరు మధ్య ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గించిందని, ఈ ఎక్స్‌ప్రెస్‌వే చిత్రాలు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ప్రాజెక్టులు వేగవంతం చేసింది ఎవరు ?

ఈ ప్రాజెక్టులన్నీ కర్ణాటకలో అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. భారతదేశంలో మౌలిక సదుపాయాల విషయానికి వస్తే, వారిద్దరి పేర్లు ఖచ్చితంగా వస్తుంది. వాళ్లు ఎవరో కాదు మైసూరు మహారాజు కృష్ణరాజ వడయార్, సర్ ఎం విశ్వేశ్వరయ్య. వీరిద్దరూ ఈ నేల వారేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కన్నడిగులు ఎప్పుడు ఇతరులకు ఆశ్రయం ఇవ్వడానికి, వారిని ఆదరించడానికి ఎప్పుడు ముందు వరసలో ఉంటారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఆ పార్టీ దోచుకుంది ఎవరి డబ్బులు ?

ఆ పార్టీ దోచుకుంది ఎవరి డబ్బులు ?

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ సమయంలో కూడా భారతదేశం మౌలిక సదుపాయాలు, దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కోసం రూ. 10 లక్షల కోట్లు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అదే సమయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ పేదల కష్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ స్పందించలేదని అన్నారు. పేదలకు కేటాయించిన డబ్బు మొత్తం ఆనాడు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకున్నారని, పేదల ఇళ్లకు నీరు, గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత మన ప్రభుత్వందే (బీజేపీ) అని ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా చెప్పారు.

ఎవరు ఏం చేశారో చెబుతాను వినండి

ఎవరు ఏం చేశారో చెబుతాను వినండి


మా ప్రభుత్వ బడ్జెట్‌లో భద్రా ఎగువ గట్టు ప్రాజెక్టు పనుల కోసం ఏకంగా రూ. 5, 300 కోట్లు ఇచ్చాం. రాష్ట్ర సాగునీటి సమస్యలను తీర్చడమే మా లక్ష్యం. పీఎం కిసాన్ పథకం ద్వారా కర్ణాటక రైతులకు రూ. 12,000 కోట్లకు పైగా డబ్బు నేరుగా వచ్చింది. మాండ్యలోని 3.75 లక్షల మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులు. పీఎం కిసాన్ సమ్మాన్ ఫండ్ రూ. 6 వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 వేలు ఇస్తోంది. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల కర్ణాటక రైతులకు కూడా రెట్టింపు ప్రయోజనం కలుగుతుందని అందుకే మరోసారి బీజేపీని మీరు ఆధరించాలని ప్రధాని నరేంద్ర మోదీ మండ్య ప్రజలకు మనవి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+