ప్రధానిగా మోడీ తొలి రోజు, ఎప్పటిలాగే (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. తన మంత్రులకు శాఖలు కేటాయించడంతో ఆయన తన పదవీబాధ్యతలను ప్రారంభించారు. అయితే ఆయన రోజువారీ జీవితంలో ఏ విధమైన మార్పు రాలేదు. యోగా, ధ్యానంతోనే తన రోజును ప్రారంభించారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత శాఖలను కేటాయింపు దస్త్రంపై సంతకం చేశారు.
శాఖల కేటాయింపుల తర్వాత ఆయన రైలు ప్రమాద మృతులకు రెండు లక్షల రూపాయల చొప్పున, గాయపడినవారికి 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఆ తర్వాత ఆయన సార్క్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. ఆయన కార్యకలాపాలపై ట్విట్టర్ ఫోటొలను చూడవచ్చు.

ధ్యానంతో ప్రారంభం
ప్రధాని అయిన తర్వాత కూడా నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితంలో మార్పు రాలేదు. ఆయన ఉదయం లేచి యోగా, ధ్యానం చేశారు.

షరీఫ్‌తో హైదరాబాద్ హౌస్‌లో...
పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌తో నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

కొయిరాలతో నరేంద్ర మోడీ..
హైదరాబాద్ హౌస్‌లో నరేంద్ర మోడీ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలతో కరచాలనం చేశారు.

మోడీతో రాజపక్ష
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్ష నరేంద్ర మోడీని కలిశారు.

గయ్యూంతో మోడీ
ఢిల్లీలో హైదరాబాద్ హౌస్‌లో మంగళవారంనాడు మాల్దీవుల అధ్యక్షుడు యామీన్ గయూమ్‌తో నరేంద్ర మోడీ ఇలా..

కర్జాయ్‌తో మోడీ..
ఢిల్లీలో హైదరాబాద్ హౌస్‌లో అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇలా...

మోడీతో సుష్మా స్వరాజ్
హైదరాబాద్ హౌస్‌లో నరేంద్ర మోడీతో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను చూడవచ్చు

మోడీ ప్రమాణం..
నరేంద్ర మోడీ భారత 15వ ప్రధాన మంత్రిగా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో పలువురు కేంద్ర మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టారు.

మహాత్మా గాంధీకి నివాళి
ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడానికి ముందు నరేంద్ర మోడీ మహాత్మా గాంధీకి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications