కోటి ఉద్యోగాలను నష్టపోయాం : ఎందుకో తెలుసా ? రాహుల్ చెప్పిన కారణమిదీ ?
అగర్తలా : ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్‌గాంధీ. మోదీ ప్రభుత్వ విధానాలు యువత పాలిట శాపమయ్యాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారాయన.
కోటి మంది ఉపాధి కోల్పోయారు ..?
బుధవారం త్రిపుర రాష్ట్రంలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. అగర్తాలకు 25 కిలోమీటర్ల దూరంలో గల కుముల్వాంగ్ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. గతేడాది నుంచి మోదీ ప్రభుత్వం అవలంభించిన విధానాల వల్ల కోటి మంది యువత ఉద్యోగవాకాశాలు కోల్పోయారని చెప్పారు. 'ప్రతిరోజు దేశానికి 450 మంది ఉద్యోగులు అవసరమవుతున్నారు. అంటే ఏడాదికి కోటి ఉద్యోగాలు నష్టపోయామని పేర్కొన్నారు. కానీ మోదీ మాత్రం 2018లో కేవలం 27 వేల ఉద్యోగాలు మాత్రమే కోల్పోయామని చెప్పారని గుర్తుచేశారు. ఇది అతి పెద్ద జోక్ అని' ఆయన అభివర్ణించారు.

అమిత్ షాపై విమర్శలు
పనిలోపనిగా బీజేపీ చీఫ్ అమిత్‌షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాహుల్‌గాంధీ. మోదీ-షా ద్వయం అరాచకాలను చూసి భరించలేని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకొచ్చారని గుర్తుచేశారు.అలాగే జడ్జి లోయ మృతి కేసు విచారణలో జోక్యం చేసుకున్నారని దుయ్యబట్టారు. అలాగే ప్రతినెల పౌరుల ఖాతాలో నగదు జమ చేస్తామని కబుర్లు చెప్పారని ... ఆచరణలో విఫలమయ్యారని ఒంటికాలిపై లేచారు. అలాగే కనీస వేతనాన్ని కూడా నిర్ణయించలేని ప్రభుత్వం .. ఐదేళ్లు చేష్టలుడిగి చూసిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications