• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ కేబినెట్‌ 2.0... కేబినెట్‌లోకి అమిత్ షా? బాధ్యతలు వద్దన్న జైట్లీ..

|

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన బీజేపీ మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. గురువారం నరేంద్రమోడీ ప్రధానిగా నరేంద్రమోడీ రెండోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మోడీ 2.0 కేబినెట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈసారి మోడీ మంత్రివర్గంలో ఎవరెవరికి బెర్తులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవుల విషయంలో మోడీ, అమిత్ షాలు దాదాపు ఐదు గంటల పాటు చర్చించి మంత్రి పదవులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న ప్రపంచ దేశాల అధినేతల జాబితా ఇదే..!

హోం మంత్రిగా అమిత్ షా?

హోం మంత్రిగా అమిత్ షా?

మోడీ 2.0 కేబినెట్‌లో అమిత్ షాకు చోటు దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనను మంత్రిగా నియమిస్తారన్న వార్తలపై కొందరు సంతోషం వ్యక్తంచేయగా... మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది చివరలో కీలకమైన మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అప్పటి వరకు ఆయన పార్టీ చీఫ్‌గా కొనసాగాలని వారు కోరుకుంటున్నారు.

బాధ్యతలు వద్దన్న జైట్లీ

బాధ్యతలు వద్దన్న జైట్లీ

మోడీ మంత్రివర్గంలో కీలక పదవుల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశముంది. హోం, ఫైనాన్స్, డిఫెన్స్, విదేశాంగ శాఖలకు సంబంధించిన బాధ్యతలను కొత్తవారికి అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ఈసారి తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని మోడీని కోరారు. ఆరోగ్యం సహకరించనందున తన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని ప్రధానికి ఆయన లేఖ రాశారు. ఆ లెటర్‌ను ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

మిత్రపక్షాలకు ప్రాధాన్యం

మిత్రపక్షాలకు ప్రాధాన్యం

ఈసారి మంత్రి వర్గంలో బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భాగస్వామ్యపక్షాలన్నింటినీ సంతృప్తి పరిచేలా కేబినెట్ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో బంపర్ మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో సంఖ్యాబలం లేనందున ప్రతిపక్షాల విషయంలో ఆచితూచి అడుగులు వేయకతప్పని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఈసారి మోడీ కేబినెట్‌లో లోక్‌ జన్ శక్తి పార్టీకి మళ్లీ అవకాశం దక్కే సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కేంద్ర మంత్రిమండలిలో సభ్యుడిలా ఉంటారని పార్టీ తీర్మానం చేసింది. గతంలో ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్‌కు కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశముందని వార్తలు వచ్చాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi and BJP chief Amit Shah met for five hours to finalise the members of the union cabinet, who will take oath with the PM. Arun Jaitley has written to Prime Minister Narendra Modi that he will "not be part of any responsibility, for the present, in the new government" because of his health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more