Modi skips AIADMK mention :అన్నాడీఎంకే పేరును పలకని మోదీ..కూటమిలో కుమ్ములాట..!!
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఎన్డీయే (NDA) బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పొత్తులో ఉన్నప్పటికీ ప్రధాన భాగస్వామ్య పక్షమైన 'అన్నాడీఎంకే' (AIADMK) పేరును ప్రధాని ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో శుక్రవారం ఎన్డీయే కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి , పీఎంకే నేత అన్బుమణి రాందాస్, టీటీవీ దినకరన్ వంటి కీలక నేతలు ఒకే వేదికపై కనిపించారు. అయితే వేదికపై అంతా సవ్యంగా ఉన్నట్లు కనిపించినా, ప్రసంగాల్లో మాత్రం విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి.

సూర్యుడు అస్తమించాడు..అన్నాడీఎంకే గెలుపు ఖాయం:ఈపీఎస్
సభలో మొదటగా మాట్లాడిన ఎడప్పాడి పళనిస్వామి డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు."ప్రధాని మోదీ అడుగుపెట్టగానే ప్రకృతి కూడా స్పందించి సూర్యుడిని (డీఎంకే గుర్తు) మరుగున పడేసింది.ఇది అసెంబ్లీ ఎన్నికల్లో మా విజయానికి సంకేతం" అని వ్యాఖ్యానించారు.కరుణానిధి కుటుంబ పాలనకు అంతం పలికే సమయం ఆసన్నమైందని, అన్నాడీఎంకే సొంతంగా మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మోదీ ప్రభుత్వంతో తాము ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉంటూ నిధులు సాధించామని ప్రధానిని ప్రశంసించారు.
Modi వ్యూహాత్మక మౌనం.. షాక్‌లో అన్నాడీఎంకే కేడర్!
అనంతరం ప్రధాని మోదీ సుమారు 45 నిమిషాల పాటు ప్రసంగించారు. తన ప్రసంగంలో డీఎంకే, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించిన మోదీ, బీజేపీ పేరును పదే పదే ప్రస్తావించారు. కానీ, చిత్రంగా వేదికపైనే ఉన్న అన్నాడీఎంకే పేరును ఒక్కసారి కూడా ఉచ్చరించలేదు.తమిళనాడులో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని మోదీ స్పష్టం చేశారు.పక్కనే ఎడప్పాడి పళనిస్వామి ఉన్నప్పటికీ, అన్నాడీఎంకే పేరును ప్రస్తావించకపోవడం ఆ పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని, అయోమయాన్ని కలిగించింది.
కూటమి పాలనా? సొంత పాలనా?
ప్రస్తుతం తమిళనాడులో 'కూటమి ప్రభుత్వం'అనే అంశంపై చర్చ నడుస్తోంది.తమిళనాడులో బీజేపీ నేతలు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, అంటే అధికారంలో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని చెబుతున్నారు.అంతేకాదు, ఏఐఏడీఎంకే పేరు కూడా ప్రధాని మోదీ పలకకపోవడం రాజకీయంగా కీలక సంకేతంగా మారింది.అయితే అన్నాడీఎంకే మాత్రం తాము మెజారిటీ సాధించి ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఇతరులు కేవలం మద్దతుదారులు మాత్రమేనని వాదిస్తోంది.
ప్రధాని మోదీ ప్రసంగం చూస్తుంటే, తమిళనాడులో బీజేపీ కేవలం జూనియర్ పార్టనర్‌గా ఉండటానికి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. అన్నాడీఎంకే పేరును పక్కనపెట్టి 'NDA' అని మోదీ సంబోధించడం, రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అధికార భాగస్వామ్యంపై పెద్ద యుద్ధమే జరుగుతుందనే సంకేతాలు ఇస్తోంది.
-
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications