ఏపీ, తెలంగాణకు ప్రధాని మోదీ మరో వరం..!!
Access way: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు అయిదు గంటల్లోనే చేరుకునే విధంగా రోడ్డు మార్గం సిద్దం చేసింది. ఈ మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించి యాక్సెస్ కంట్రోల్ (Access way) చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు రెండు ప్రభుత్వాలకు సమాచారం అందింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఈ మార్గంలో బెంగళూరు కు ఏడు నుంచి ఎనిమిది గంటల సమం పడుతోంది. యాక్సెస్ కంట్రోల్ ద్వారా రెండు నుంచి మూడు గంటల సమయం ఆదా కానుంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇందు కోసం తొలుత హైవే 44 ను విస్తరించకుండా దీనికి సమాంతరంా మరో గ్రీన్ ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ నిర్మాణం పైన ప్రతిపాదనలు సిద్దం చేసారు. గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రస్తుత ఎన్‌హెచ్-44 నుంచి 10-15 కి.మీ. దూరంలోనే సమాంతరంగా వెళ్తోంది. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఎన్‌హెచ్-44 ప్రస్తుతం 576 కి.మీ. ఉండగా, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ కూడా దాదాపు అంతే దూరం వస్తోంది. ఎన్‌హెచ్-44 నుంచి 30-40 కి.మీ. దూరంగా గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ను తీసుకెళ్లాలని భావిస్తే దాని పొడవు, ఎన్‌హెచ్-44 కంటే మరింత ఎక్కువవుతోందని తేల్చారు. దీంతో.. గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ను కొత్తగా నిర్మాణం కంటే.. ప్రస్తుత హైవేనే ఆరు వరుసలుగా విస్తరించి, దాన్ని యాక్సెస్ కంట్రోల్ చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు.

ఇక అయిదు గంటల్లోనే
దీనికి సంబంధించి డీపీఆర్ ను అయిదు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఇందు కోసం అవసరమైన భూ సేకరణతో పాటుగా నిర్మాణ వ్యవయం వంటి అన్ని అంశాలతో కలిపి అంచనాలు సిద్దం చేయనున్నారు. గతంలో గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కోసం దాదాపుగా రూ 13 వేల కోట్లు అవసరం అవుతుందని అంచనా వేసారు. ఇప్పుడు పాత హైవేను విస్తరించి.. యాక్సెస్ కంట్రోల్ గా మార్చటం ద్వారా ప్రాజెక్టు వ్యయం సైతం తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్ హెచ్ -44 తెలంగాణలో 210 కి.మీ., ఏపీలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో 260 కి.మీ., కర్ణాటకలో 106 కి.మీ. కలిపి మొత్తం 576 కి.మీ. ఉంది. దీన్ని ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్‌గా మారిస్తే వాహనాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా వెళ్తాయని చెబుతున్నారు. దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరం గా ఉండనుంది.












Click it and Unblock the Notifications